న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pro Kabaddi League: తెలుగు టైటాన్స్‌కు పంజాబ్ కింగ్స్‌ దరిద్రం! మళ్లీ ఓటమే!

Pro Kabaddi League: Telugu Titans Follows Kings 11 Punjab By Losing At Close Finish

బెంగళూరు: ఐపీఎల్‌ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ దరిద్రం ప్రొకబడ్డీ లీగ్ టీమ్ తెలుగు టైటాన్స్‌కు పట్టుకున్నట్లుంది. సునాయసంగా గెలిచే మ్యాచ్‌లో ఓడటం.. గెలిచిన మ్యాచ్‌లో ఆఖరి క్షణం వరకు ఉత్కంఠ రేపడం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ టీమ్‌కు అలవాటు. సూపర్ ఓవర్‌కే సూపర్ ఓవర్ ఆడిన ఘనత కూడా ఆ జట్టుదే. ప్రొకబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్ పరిస్థితి కూడా అలానే ఉంది.

తాజాగా జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 27-28 తేడాతో బెంగాల్ వారియర్స్ చేతిలో పాయింట్ తేడాతో ఓటమిపాలైంది. బెంగాల్ వారియర్స్ కెప్టెన్ మనీందర్ సింగ్(10 పాయింట్లు) సూపర్ 10తో చెలరేగగా.. సుకేశ్ హెగ్దే 5 పాయింట్స్ సాధించాడు. తెలుగు టైటాన్స్‌లో రజనీష్ 11 పాయింట్లు సాధించగా మిగతా ప్లేయర్లు విఫలమయ్యారు.

హోరాహోరీగా..

హోరాహోరీగా..

మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఫస్టాఫ్‌లో ఏడు రైడ్ పాయింట్స్ సాధించిన తెలుగు టైటాన్స్ 6 ట్యాకిల్ పాయింట్స్ సాధించింది. ఇక బెంగాల్ మాత్రం 8 రైడింగ్, 6 ట్యాకిల్ పాయింట్లతో 14-13తో ఒక్క పాయింట్‌ లీడ్ సాధించింది. ఇరు జట్లు ఒక్కసారి కూడా ఆలౌట్ కాలేదు. సెకండాఫ్‌లో కూడా ఇరు జట్లు నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. 8 రైడ్, 4 ట్యాకిల్, 2 ఎక్స్‌ట్రా పాయింట్స్‌తో తెలుగు టైటాన్స్ 14 పాయింట్లు సాధించగా.. బెంగాల్ వారియర్స్ కూడా 8 రైడ్, 2 ట్యాకిల్, 2 ఆలౌట్, 2 ఎక్స్‌ట్రా పాయింట్స్‌తో 14 పాయింట్సే సాధించింది.

కీలక సమయంలో ఆలౌటై...

కీలక సమయంలో ఆలౌటై...

అయితే ఫస్టాఫ్‌లో సాధించిన లీడ్‌తో బెంగాల్ వారియర్స్ విజయాన్నందుకుంది. ఆఖరి క్షణంలో తప్పులు చేసిన తెలుగు టైటాన్స్ మూల్యం చెల్లించుకుంది. 24-24తో స్కోర్లు సమంగా ఉన్నప్పుడు ఆలౌటవ్వడం తెలుగు టైటాన్స్ కొంపముంచింది. దాంతో మూడు పాయింట్స్ ఆధిక్యంలోకి వెళ్లిన బెంగాల్.. ఆఖరి వరకు ఆ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్నందుకుంది. విజయం కోసం ఎదురు చూసిన తెలుగు అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది.

పాయింట్స్ టేబుల్లో అట్టడుగున..

పాయింట్స్ టేబుల్లో అట్టడుగున..

ఈ మ్యాచే కాదు.. తెలుగు టైటాన్స్ ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో దాదాపు అన్నీ ఇలా ఉత్కంఠగా ముగిసినవే. ఇందులో రెండు మ్యాచ్‌లు టై అవ్వగా.. మరో 8 మ్యాచ్‌ల్లో ఓటమే ఎదురైంది. ఒక్క విజయం కూడా నమోదు చేయని తెలుగు టైటాన్స్ పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్‌లో యూపీ యోధా 50-40‌తో పుణేరీ పల్టాన్‌ను ఓడించింది.

Story first published: Monday, January 17, 2022, 22:49 [IST]
Other articles published on Jan 17, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X