న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కబడ్డీ మాస్టర్స్: పాక్ ఆటగాళ్లకు వీసా కష్టాలు, మ్యాచ్‌పై లేని స్పష్టత

By Nageshwara Rao
 Kabaddi Masters: Visa problems delay Pakistan’s arrival

హైదరాబాద్: దుబాయి వేదికగా ఆరు దేశాల మధ్య తొలిసారి నిర్వహిస్తున్న 'కబడ్డీ మాస్టర్స్‌' టోర్నమెంట్‌‌లో పాల్గొనే పాకిస్థాన్ ఆటగాళ్లకు వీసా కష్టాలు ఎదురయ్యాయి. దీంతో మ్యాచ్‌ ప్రారంభానికి కొన్ని గంటల ముందే వారు టోర్నీ జరిగే దుబాయికి చేరుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

శుక్రవారం నుంచి దుబాయిలో కబడ్డీ మాస్టర్స్‌ టోర్నీ ప్రారంభంకానుంది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్‌-పాకిస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. 9 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో ఆరు జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి పోటీ పడుతున్నాయి. షెడ్యూల్‌లో భాగంగా టోర్నీ కోసం పాకిస్థాన్ మినహా అన్ని దేశాలకు చెందిన జట్లు మంగళవారం నాటికే దుబాయి చేరుకున్నాయి.

అయితే, వీసా మంజూరు కాని కారణంగా పాకిస్థాన్ జట్టులోని ఆటగాళ్లు దుబాయికి చేరుకోలేదు. దీంతో గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయానికి ఆటగాళ్లు దుబాయి చేరుకుంటారని టోర్నీ నిర్వాహకులు తెలిపారు. కాగా, ఇప్పటి వరకు పాక్‌ ఆటగాళ్లు దుబాయి చేరుకున్నట్లు అధికారులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

 Kabaddi Masters: Visa problems delay Pakistan’s arrival

స్టార్‌ ఇండియాతో కలిసి అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య(ఐకేఎఫ్‌) ఈ టోర్నీని నిర్వహిస్తోంది. ఈ టోర్నీలో భారత్ పేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో పాక్‌, కెన్యాలతో కలిసి భారత్‌ గ్రూప్‌- ఎలో ఉంది. గ్రూప్‌- బిలో ఇరాన్‌, కొరియా, అర్జెంటీనా జట్లు ఉన్నాయి.

తొలుత రౌండ్‌ రాబిన్‌లో గ్రూప్‌ ఒక జట్టు మిగత రెండు ప్రత్యర్థులతో రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది. గ్రూప్‌లో టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అజయ్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. రాహుల్‌ చౌదరి, పర్దీప్‌ నర్వాల్‌, రోహిత్‌ కుమార్‌, రిషాంక్‌ దేవడిగ, మోను గోయత్‌, దీపక్‌ హుడా, మంజీత్‌ చిల్లర్‌, సురేందర్‌ నాడా, గిరీష్‌ ఎర్నాక లాంటి ఆటగాళ్లతో భారత జట్టు బలంగా ఉంది.


పూర్తి షెడ్యూల్:
June 22, 2018
India vs Pakistan - 8 pm IST
Iran vs South Korea - 9 pm IST


June 23, 2018
Iran vs Argentina - 8 pm IST
India vs Kenya - 9 pm IST


June 24, 2018
South Korea vs Argentina - 8 pm IST
Pakistan vs Kenya - 9 pm IST


June 25, 2018
Iran vs South Korea - 8 pm IST
India vs Pakistan - 9 pm IST


June 26, 2018
Iran vs Argentina - 8 pm IST
India vs Kenya - 9 pm IST


June 27, 2018
South Korea vs Argentina - 8 pm IST
Pakistan vs Kenya - 9 pm IST


June 29, 2018 - Semi-finals
SF1: A1 vs B2 - 8 pm IST
SF2: B1 vs A2 - 9 pm IST


June 30, 2018 - Final
Winner of SF1 vs Winner of SF2 - 8 pm IST


స్టార్‌ ఇండియాతో కలిసి అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య (ఐకేఎఫ్‌) ఈ టోర్నీని నిర్వహిస్తోంది.
రాత్రి 8 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌ 1, 2లో ప్రత్యక్ష ప్రసారం

Story first published: Friday, June 22, 2018, 16:06 [IST]
Other articles published on Jun 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X