న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండో స్థానంపై కన్నేసిన బెంగాల్... గెలుపు రుచి కోసం తమిళ తలైవాస్

Bengal Warriors battle Tamil Thalaivas as both look to bounce back from recent losses

హైదరాబాద్: ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో భాగంగా గురువారం బెంగాల్ వారియర్స్, తమిళ తలైవాస్ జట్లు తలపడనున్నాయి. గత మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఈ మ్యాచ్‌ని ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి బెంగాల్ వారియర్స్ పాయింట్ల పట్టికలోకి రెండో స్థానంలోకి ఎగబాకాలని చూస్తుంటే... తమిళ తలైవాస్ టాప-6లో చోటు దక్కించుకోవాలని భావిస్తోంది.

ఈ సీజన్‌లో ఢిల్లీ అంచె సైతం ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం పది మ్యాచ్‌లు ఆడిన బెంగాల్ వారియర్స్ ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 34 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో గనుక విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో మరింత మెరుగవుతుంది.

ట్విట్టర్‌లో ఎవరేమన్నారు?: మేజర్ ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళి

రైడర్లు చక్కటి ఫామ్‌లో

రైడర్లు చక్కటి ఫామ్‌లో

బెంగాల్ విజయానికి కారణం ఆ జట్టు స్టార్ రైడర్లు చక్కటి ఫామ్‌లో ఉండటమే. కెప్టెన్ మనిందర్ సింగ్, ప్రపంజన్, ఇరాన్‌కు చెందిన మహ్మద్ నబీభక్ష సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఈ ముగ్గురూ కలిసి ఈ సీజన్‌లో ఇప్పటికే 191 రైడ్ పాయింట్లను సాధించారు. ఇక, ట్యాకిల్ పాయింట్ల విషయానికి వస్తే యావరేజి కూడా ఎక్కువగానే ఉంది.

బెంగాల్ వారియర్స్

బెంగాల్ వారియర్స్

ఆడినవి: 10

గెలిచినవి: 5

టై: 2

ఓడినవి: 3

విన్ రేట్: 50%

బెస్ట్ రైడర్: మనిందర్ సింగ్

బెస్ట్ డిఫెండర్: బల్దేవ్ సింగ్

India vs West Indies: జమైకాలో ధోని రికార్డు బద్దలవడం ఖాయం!

టాప్ రైడర్‌గా రాహుల్ చౌదరి

టాప్ రైడర్‌గా రాహుల్ చౌదరి

ఇక, తమిళ తలైవాస్ విషయానికి వస్తే ఈ సీజన్‌లో స్టార్ రైడర్ రాహుల్ చౌదరిని దక్కించుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో జట్టు ప్రదర్శన లేదు. ఇప్పటివరకు పది మ్యాచ్‌లు ఆడిన తమిళ తలైవాస్ కేవలం మూడింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలొ కొనసాగుతోంది. ఈ సీజన్‌లో రాహుల్ చౌధరి (64) రైడ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ జట్టుని విజయాల బాట పట్టించలేకపోతున్నాడు.

ఫామ్‌లోకి అజిత్ కుమార్

ఫామ్‌లోకి అజిత్ కుమార్

అయితే, గత కొన్ని మ్యాచ్‌లుగా రైడర్ అజిత్ కుమార్ ఫామ్‌లోకి రావడం జట్టుకు సానుకూల అంశం. బెంగాల్ వారియర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో షో మ్యాన్ రాహుల్ చౌదరికి తోడు అజిత్ కుమార్ గనుక విజృంభిస్తే విజయం ఖాయం. అయితే, గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమి ఆ జట్టుని నిరాశపరుస్తోంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌లో తమిళ తలైవాస్ ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

తమిళ తలైవాస్

తమిళ తలైవాస్

ఆడినవి: 10

గెలిచినవి: 3

టై: 2

ఓడినవి: 5

విన్ రేట్: 30%

బెస్ట్ రైడర్: రాహుల్ చౌదరి

బెస్ట్ డిఫెండర్: మోహిత్ చిల్లర్

Story first published: Thursday, August 29, 2019, 16:00 [IST]
Other articles published on Aug 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X