India vs West Indies: జమైకాలో ధోని రికార్డు బద్దలవడం ఖాయం!

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. భారత్ తరుపున అత్యధిక టెస్టు మ్యాచులు గెలిచిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ... మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును బద్దలు కొట్టనున్నాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా రెండో టెస్టు శుక్రవారం నుంచి జమైకాలోని కింగ్‌స్టన్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
ఈ మ్యాచ్‌లో గనుక టీమిండియా విజయం సాధిస్తే విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సాధిస్తాడు. అత్యధిక మ్యాచ్‌లను గెలిపించిన కెప్టెన్‌గా కోహ్లీ నిలుస్తాడు. ధోనీ 60 టెస్టులాడి 27 మ్యాచ్‌ల్లో టీమిండియాను గెలిపించాడు. మరో 15 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. 18 మ్యాచ్‌ల్లో టీమిండియా ఓడింది. కోహ్లీ 47 టెస్టు మ్యాచ్‌లాడి 27 మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు.

రెండో టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే
10 మ్యాచ్‌ల్లో ఓడిపోగా మరో 10 టెస్టులు డ్రాగా ముగిశాయి. జమైకాలోని కింగ్‌స్టన్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న రెండో టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే గనుక కెప్టెన్‌గా ధోనికి ఇది 28వ విజయం అవుతుంది. ఈ క్రమంలో ఇప్పటివరకూ ధోని పేరిట ఉన్న 27 మ్యాచ్‌ల రికార్డును కోహ్లీ బద్దలు కొడతాడు.
సానియా మిర్జాకు పీటీ ఉషకు తేడా తెలియదా?: విశాఖ బీచ్‌రోడ్‌లో ఫోటో వైరల్

అత్యధిక టెస్టు విజయాలనందించిన కెప్టెన్‌గా
అంతేకాదు విదేశాల్లో టీమిండియాకు అత్యధిక టెస్టు విజయాలనందించిన కెప్టెన్‌గా కూడా కోహ్లీ రికార్డు సాధిస్తాడు. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా విదేశాల్లో 26 టెస్టులాడగా అందులో 12 మ్యాచ్‌లను గెలిచింది. మాజీ కెప్టెన్ గంగూలీ రికార్డు(28 మ్యాచ్‌ల్లో 11విజయాలు)ను కోహ్లీ ఇప్పటికే అధిగమించాడు.

21 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం
సౌరవ్ గంగూలీ సారథ్యంలో 49 టెస్టుల ఆడగా అందులో 21 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. నెలరోజుల సుదీర్ఘ వెస్టిండిస్ పర్యటనలో కోహ్లీసేనకు ఇదే ఆఖరి మ్యాచ్ కావడం విశేషం. ఈ టెస్టుతో టీమిండియా వెస్టిండిస్ పర్యటన ముగుస్తుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత జరిగిన టీ20 సిరిస్‌ను 3-0తో టీమిండియా కైవసం చేసుకుంది.
భారత్ vs విండిస్; కపిల్ రికార్డుని ఇషాంత్ బద్దలు కొట్టేనా?

తొలి టెస్టులో గెలిచిన టీమిండియా
తర్వాత జరిగిన వన్డే సిరిస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. ఇప్పటికే తొలి టెస్టులో గెలిచిన టీమిండియా రెండో టెస్టును గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. తొలి టెస్టులో టీమిండియా 318 పరుగుల తేడాతో విజయం సాధించడంలో ఇషాంత్ శర్మ కీలకపాత్ర పోషించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications