న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాకీ వరల్డ్‌కప్: ఐర్లాండ్‌ చేతిలో భారత్‌ ఓటమి, నాకౌట్‌‌కు కష్టమే

By Nageshwara Rao
Womens Hockey World Cup 2018: India lose 0-1 to Ireland; Anna OFlanagan scores only goal of game

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న మహిళల హాకీ వరల్డ్‌కప్‌లో భారత మహిళల జట్టు నాకౌట్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పూల్‌ 'బి'లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో పూర్తిగా విఫలమైన భారత జట్టు 0-1 తేడాతో ఐర్లాండ్‌ చేతిలో ఓటమి పాలైంది.

ఈ మ్యాచ్‌లో లభించిన ఏడు పెనాల్టీ కార్నర్లలో ఒక్కదాన్ని కూడా భారత మహిళల జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఐర్లాండ్‌ తరఫున 13వ నిమిషంలో అనా ఫ్లానగన్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచింది. ప్రత్యర్థి తనకంటే తక్కువ ర్యాంకులో ఉన్నప్పటికీ భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శించలేకపోయింది.

ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేసిన భారత్‌ అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచే ఐర్లాండ్‌ దూకుడుగా ఆడింది. 13వ నిమిషంలో ఆ జట్టుకు లభించిన పెనాల్టీ కార్నర్‌ను అన్నా ఒఫ్లానగన్‌ గోల్‌గా మలచి ఐర్లాండ్‌కు ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత అద్భుతమైన డిఫెన్స్‌తో భారత్‌ను నిలువరించింది.

అటాకింగ్‌, డిఫెన్స్‌లో పూర్తిగా తేలిపోయిన భారత్

ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఏ సమయంలోనూ పూర్తి ఆటతీరును ప్రదర్శించినట్లు కనిపించలేదు. అటాకింగ్‌, డిఫెన్స్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. మ్యాచ్‌లో భారత్‌కు ఏడు పెనాల్టీ కార్నర్‌ అవకాశాలు లభించగా వాటిలో ఏ ఒక్కదాన్ని గోల్‌గా మలచలేకపోయింది. ఫీల్డ్‌ గోల్స్‌ అవకాశాలు వచ్చినా ఫినిషింగ్‌ లోపంతో వాటిని వృథా చేసుకుంది.

రెండో క్వార్టర్‌ చివరి నిమిషంలో

రెండో క్వార్టర్‌ చివరి నిమిషంలో

ఇక, రెండో క్వార్టర్‌ చివరి నిమిషంలో భారత స్ట్రయికర్‌ లీలిమ మింజ్‌ సునాయాస అవకాశాన్ని చేజార్చింది. ‘డి' ఏరియాలో అందిన పాస్‌ను నేరుగా గోల్‌కీపర్‌ చేతుల్లోకి కొట్టి నిరాశపరిచింది. 37వ నిమిషంలో వచ్చిన నాలుగో పెనాల్టీ కార్నర్‌ను గుర్జీత్‌ కౌర్‌ అద్భుతంగా కొట్టినా ఐరిష్‌ గోల్‌కీపర్‌ కుడివైపుకు దూకుతూ అంతే అద్భుతంగా అడ్డుకుంది.

మ్యాచ్ ముగియడానికి ఆరు నిమిషాల ముందు

మ్యాచ్‌ ముగియడానికి మరో ఆరు నిమిషాల ముందు స్కోరు సమం చేయడానికి భారత్‌కు మరో అవకాశం వచ్చినా కెప్టెన్‌ రాణి రాంపాల్‌ గోల్‌గా మలచలేకపోవడంతో భారత్‌ ఓటమి ఖాయమైంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో డ్రా చేసుకున్న భారత్‌... ఈ ఓటమితో క్వార్టర్స్‌ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

రెండు విజయాలతో అగ్రస్థానంలో ఐర్లాండ్‌

మరోవైపు లీగ్‌ దశలో వరుసగా రెండు విజయాలు సాధించిన ఐర్లాండ్‌ 6 పాయింట్లతో గ్రూప్‌ ‘బి'లో అగ్రస్థానంతో నాకౌట్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. ఇంగ్లాండ్‌ రెండు పాయింట్లతో, భారత్‌.. అమెరికా ఒక్కో పాయింట్‌తో ఉన్నాయి. ఐర్లాండ్‌ చేతిలో భారత్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. గతేడాది జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన హాకీ వరల్డ్‌ లీగ్‌ సెమీఫైనల్లోనూ భారత్‌ 1-2తో ఐర్లాండ్‌ చేతిలో పరాజయం పాలైంది. భారత్‌ క్వార్టర్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఆదివారం జరిగే చివరి మ్యాచ్‌లో అమెరికాపై భారీ ఆధిక్యంతో గెలవాల్సి ఉంది.

Story first published: Friday, July 27, 2018, 10:29 [IST]
Other articles published on Jul 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X