న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెమీ ఫైనల్ సమరానికి సై అంటోన్న భారత్-జపాన్

India look to assert continental supremacy against Japan in ACT semifinal

హైదరాబాద్: ఆసియా గేమ్ ఛాంపియన్ షిప్‌లో విజేతగా నిలిచిన జపాన్ జట్టుతో శనివారం పోరాడేందుకు టీమిండియా సన్నద్ధమవుతోంది. కేవలం మలేసియాతో ఆడిన మ్యాచ్‌ను మినహాయించి అన్నింటిలోనూ విజయంతో దూసుకెళ్తోన్న టీమిండియా సెమీ ఫైనల్‌లోనూ విజయం రావొచ్చనే తలంపుతో సన్నాహమవుతోంది. ఇప్పటివరకూ 5గేమ్‌లు ఆడిన టీమిండియా ప్రస్తుతం 13 పాయింట్లతో లీగ్ పట్టికలో టాప్ స్థానంలో కొనసాగుతోంది.

ఆ తర్వాతి స్థానాలలో పాకిస్తాన్ 10పాయింట్లతో ఉండగా జపాన్.. మలేసియాలు కొనసాగుతున్నాయి. ఆసియన్ ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా జరగుతోన్న లీగ్‌ను అన్నీ జట్లు భువనేశ్వర్‌లో జరగనున్న ప్రపంచ కప్‌కు ప్రాక్టీస్ మ్యాచ్‌లాగే భావిస్తున్నాయి. గత మ్యాచ్ డ్రా జరగడంతో భారత్ మరోసారి సత్తా చాటి తను కప్ గెలుచుగోలనని నిరూపించుకోనుంది. ఈ క్రమంలో భారత కోచ్ జట్టు పట్ల గాఢమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

ఇదే లీగ్‌లో భారత్ ఒమన్ జట్టును 11-0తేడాతో, పాకిస్తాన్‌ను 3-1తేడాతో, జపాన్ 9-0తేడాతో దక్షిణకొరియాను 4-1తేడాతో ఓడించింది. ఇదే స్థాయిలో కొనసాగితే ఆసియా గేమ్స్‌లో కాంస్యంతో సరిపెట్టుకోదని జపాన్‌పై గెలిచి మరింత పటిష్టమని నిరూపించుకోనుంది. ఈ క్రమంలో తమ జట్టు ప్లేయర్ల గురించి మాట్లాడతూ కోచ్.. హరేందర్ సింగ్.. 'మా ప్లేయర్లు సంయమనంతో ఆడుతున్న తీరు బాగా ఆకట్టుకుంటుంది. సెమీ ఫైనల్‌లో జపాన్‌ను ఓడించి మరోసారి మేమేంటో నిరూపించుకుంటాం.' అని నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.

జపాన్ జట్టులో ఆరుగురు యువ ప్లేయర్లు ఉండగా జట్టు బలంగానే కనిపిస్తోంది. ఇదే జట్టుతో జకార్తా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లో స్వర్ణాన్ని గెలుచుకున్నప్పటికీ వరల్డ్ కప్‌కు అర్హత సాధించలేకపోయింది. కానీ, తమ జట్టు టీమిండియాను ఎదుర్కొని బలమైన జట్టు నిరూపించుకుంటామని జపాన్ కోచ్ ఐక్మాన్ తెలిపాడు.


Match starts at 10.40 PM IST
Live on Star Sports Network
Live streaming on Hotstar

Story first published: Friday, October 26, 2018, 17:12 [IST]
Other articles published on Oct 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X