న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Hockey World Cup 2023: వేల్స్‌పై గెలిచినా.. భారత్‌కు దక్కని క్వార్టర్స్ బెర్త్!

Hockey World Cup 2023: India beat Wales 4-2 to face New Zealand for quarter final berth

భువనేశ్వర్‌: హాకీ ప్రపంచకప్‌లో వరుస విజయాలు సాధించినా.. భారత్‌కు నేరుగా క్వార్టర్స్ బెర్త్ దక్కలేదు. క్వార్టర్స్ చేరాలంటే భారీ తేడాతో గెలవాల్సిన తమ చివరి పూల్‌ మ్యాచ్‌లో భారత్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. గురువారం జరిగిన పూల్-డి మ్యాచ్‌లో తొలి ప్రపంచకప్‌ ఆడుతున్న పసికూన వేల్స్‌ను 4-2తో ఓడించింది. కానీ ఈ విజయం క్వార్టర్స్ చేరడానికి సరిపోలేదు. క్రాసోవర్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడిస్తే.. భారత్‌ క్వార్టర్స్‌కు చేరుతోంది. వేల్స్‌తో పోరులో భారత్‌ తరఫున ఆకాశ్‌దీప్‌ సింగ్‌ (32వ, 46వ) రెండు గోల్స్‌ కొట్టగా..

షంషేర్‌ సింగ్‌ (21వ), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (59వ) చెరో గోల్‌ సాధించారు. ప్రత్యర్థి జట్టులో గారెత్‌ ఫర్లాండ్‌ (42వ), జాకబ్‌ డ్రేపర్‌ (44వ) గోల్స్‌ చేశారు.

ఫస్టాఫ్‌లో ఒక్కటే గోల్..

ఫస్టాఫ్‌లో ఒక్కటే గోల్..

క్వార్టర్‌ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించాలంటే ఎనిమిది గోల్స్‌ తేడాతో గెలవాల్సిన స్థితిలో బరిలోకి దిగిన భారత్‌.. అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. మ్యాచ్‌లో చాలా పెనాల్టీ కార్నర్‌లను భారత్ వృథా చేసింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉన్న వేల్స్‌.. అయిదో స్థానంలోని భారత్‌కు కనీస పోటీ ఇస్తుందా అన్న అంచనాల మధ్య మ్యాచ్‌ ఆరంభంకాగా.. తొలి క్వార్టర్‌లో భారత్‌ ఒక్క గోల్‌ కూడా చేయకుండా పసికూన అడ్డుకుంది. ప్రథమార్ధం ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు ఒక్క గోలే చేసింది.

2 గోల్స్‌తో షాకిచ్చిన వేల్స్..

మూడో క్వార్టర్‌లో అసలు డ్రామా మొదలైంది. 2-0 ఆధిక్యంలో ఉన్న భారత్‌ మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌తో వేల్స్‌ షాకిచ్చింది. భారత డిఫెన్స్‌ను పరీక్షిస్తూ వేల్స్‌ ఆటగాళ్లు రెండు గోల్స్‌ కొట్టారు. భారీ ఆధిక్యంతో గెలవడం అటుంచితే.. అసలు భారత్‌ విజయం సాధిస్తుందా? అన్న సందేహం కలిగింది. అయితే ఆఖరి క్వార్టర్‌లో ఆధిపత్యం చెలాయించిన భారత ఆటగాళ్లు జట్టుకు విజయాన్ని అందించారు. ఆకాశ్‌దీప్‌ తిరిగి ఆధిక్యంలో నిలిపితే.. మ్యాచ్‌ ముగియడానికి నిమిషం ముందు హర్మన్‌ప్రీత్‌ గోల్‌తో జట్టుకు నాలుగో గోల్‌ అందించాడు.

గోల్స్ తేడాతోనే..

మొత్తానికి పూల్‌-డిలో ఇంగ్లండ్‌ వెనక రెండో స్థానంతో భారత్‌ సరిపెట్టుకుంది. భారత్‌, ఇంగ్లండ్‌లు రెండేసి విజయాలు, ఒక్కో డ్రాతో ఏడు పాయింట్లు సాధించి సమంగా నిలిచాయి. కానీ మెరుగైన గోల్‌ తేడాతో ఇంగ్లండ్‌ అగ్రస్థానం దక్కించుకుని ముందంజ వేసింది. ఇంగ్లండ్ మొత్తం 9 గోల్స్ నమోదు చేయగా.. భారత్ 6 గోల్స్ చేసింది. ఆదివారం న్యూజిలాండ్‌ను భారత్ ఢీకొంటుంది.

నెదర్లాండ్స్ రికార్డు విజయం..

నెదర్లాండ్స్ రికార్డు విజయం..

మరో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 4-0తో స్పెయిన్‌ను చిత్తు చేసింది. గ్రూప్‌-సిలో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 14-0తో చిలీపై ఘనవిజయం సాధించింది. ప్రపంచకప్‌ మ్యాచ్‌లో అత్యధిక గోల్స్‌తో తేడాతో గెలిచిన జట్టుగా నెదర్లాండ్స్‌ నిలిచింది. ఆస్ట్రేలియా రికార్డు (దక్షిణాఫ్రికాపై 12-0)ను బద్దలు కొట్టింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన నెదర్లాండ్స్‌ గ్రూపులో అగ్రస్థానంలో నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించింది. మరో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 3-2తో మలేసియాకు షాకిచ్చి గ్రూపులో రెండో స్థానంలో నిలిచింది.

Story first published: Friday, January 20, 2023, 8:19 [IST]
Other articles published on Jan 20, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X