
2007లోనే విచారణ చేయాలని
దీంతో 2007లోనే విచారణ చేయాలని ఇండియన్ ఎయిర్ లైన్స్ విజిలెన్స్ అధికారులు అప్పటి హైదరాబాద్ కలెక్టర్‌ను కోరారు. ఆ తర్వాత 2018 నవంబర్‌లో ఇదే విషయంపై చర్యలు తీసుకోవాలని సికింద్రాబాద్ తహశీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించారు. దీంతో ముఖేష్ కుమార్ పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ముఖేష్ సోదరుడు సురేష్‌పై కూడా చీటింగ్ కేసు
ముఖేష్‌తో పాటు ఆయన సోదరుడు సురేష్‌పై కూడా చీటింగ్ కేసు నమోదు అయింది. ఈ ఘటనపై బోయినపల్లి సీఐ రాజేశ్ మాట్లాడుతూ "ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం కోసం ముఖేష్ పలు పత్రాలు సమర్పించారు. వాటిపై విచారణ జరపగా.. అతడు నకిలీ పత్రాలతో కుల ధ్రువీకరణ పత్రం పొందినట్టు వెల్లడైంది" అని అన్నారు.

ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు
"దీంతో రెండు వారాల క్రితం ముఖేష్‌పై కేసు నమోదు చేశాం. మూడు రోజులుగా ముఖేష్ పరారీలో ఉన్నారు.. అతని కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపడుతున్నాం. ముఖేష్‌తో పాటు అతని తమ్ముడిపైన కూడా కేసు నమోదు చేశాం" అని సీఐ రాజేశ్ తెలిపారు. 307 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ముఖేష్ 80 గోల్స్ చేశాడు.