న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్క పాయింట్ తేడాతో స్వర్ణాన్ని చేజార్చుకున్న భారత్‌

Four-Nations Hockey: India settle for silver after shootout loss to Belgium

హైదరాబాద్: నాలుగు దేశాల హాకీ టోర్నీలో భారత్‌కు కొద్దిలో విజయం చేజారింది. అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన రెండో ఇన్నింగ్స్ ఫైనల్లో భారత్‌ షూటౌట్లో బెల్జియం చేతిలో ఓడిపోయింది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో భారత హాకీ జట్టు బెల్జియం చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

అయితే ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. కానీ, నిర్ణీత సమయానికి రెండు జట్లు 4-4 గోల్స్‌తో సమంగా నిలిచాయి. దీంతో భారత జట్టు సిల్వర్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

భారత్‌ తరఫున రమణ్‌దీప్‌ రెండు గోల్స్‌ (29వ, 53వ) కొట్టగా.. నీలకంఠ (42వ), మన్‌దీప్‌ (49వ) చెరో గోల్‌ సాధించారు. బెల్జియంలో జట్టు కోసిన్స్‌ (41వ), చార్లియర్‌ (43వ), క్యుస్టెర్స్‌ (51వ), డెనాయర్‌ (56వ) తలో గోల్‌ కొట్టారు. షూటౌట్లో బెల్జియం 3-0తో గెలిచింది.

ఇదే రోజున జపాన్‌కు న్యూజిలాండ్‌కు జరిగిన మ్యాచ్‌లో 4-1తేడాతో జపాన్ గెలిచింది. దీంతో జపాన్ జట్టు కాంస్యాన్ని దక్కించుకుంది. తర్వాత జరిగిన ఫైనల్‌లో భారత్, బెల్జియం జట్లు పోటీ పడ్డాయి. మ్యాచ్ ఒకానొక పరిస్థితిలో 52 సెకండ్ల పాటు జరిగిన ఉత్కంఠ భరితమైన పోరులో బెల్జియం జట్టు ముగ్గురు ఆటగాళ్లు గోల్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. వారు చేసిన గోల్‌ను భారత గోల్ కీపర్ చాకచక్యంగా ఆపగలిగాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 29, 2018, 10:41 [IST]
Other articles published on Jan 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X