న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ అంపైర్లు ఉన్నారే.. ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలతో ఇబ్బంది పెడతారు: వీరేంద్ర సెహ్వాగ్

 CWG 2022: Virender Sehwag slams umpiring bias as India suffer heartbreaking loss to Australia

న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టుకు జరిగిన అన్యాయంపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. ఏ ఆటలోనైనా అంపైర్ల అంతా ఇంతేనని విమర్శించాడు. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో భారత అమ్మాయిలు షూటౌట్‌లో 3-0తో ఓటమిపాలయ్యారు. మ్యాచ్ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో పటిష్ట ఆస్ట్రేలియాను నిలువరించిన భారత అమ్మాయిలు.. అంపైర్ తప్పిదం కారణంగా షూటౌట్‌లో వెనుకబడి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం ఈ అంపైర్ తప్పిదంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 అంపైర్ తొండాట..

అంపైర్ తొండాట..

నిర్ణీత సమయంలో మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో షూటౌట్ ద్వారా ఈ మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించారు. అయితే ఆస్ట్రేలియా డిఫెండర్‌ అంబ్రోషియా మలోనే తొలి ప్రయత్నంలో గోల్ సాధించలేకపోయింది. ఆమె కొట్టిన కిక్‌ను భారత గోల్‌కీపర్‌ సవితా చాకచక్యంగా అడ్డుకుంది. ఆసీస్ పెనాల్టీ వృథా అయిందని భారత శిబిరం సంతోషంలో మునిగిపోగా అంపైర్ షాకిచ్చింది. క్షమించండి.. షూటౌట్‌ క్లాక్‌ టైంలో తప్పిదం ఉందని.. మళ్లీ ప్రారంభించాలని చెప్పి ఆస్ట్రేలియాకు మరో అవకాశాన్ని ఇచ్చింది.

టైమ్ స్టార్ అవ్వలేదని..

టైమ్ స్టార్ అవ్వలేదని..

అప్పటికే షూటౌట్‌ చేయడానికి వచ్చిన భారత క్రీడాకారిణికి విషయం చెప్పి అక్కడి నుంచి పంపించేసి మల్లీ అంబ్రోషియాను పిలిచింది. తొలిసారి మిస్‌ అయిన అంబ్రోషియా ఈసారి మాత్రం గురి తప్పలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియా వరుసగా మూడు గోల్స్‌ కొట్టగా.. నిరాశ నిస్పృహకు లోనైన భారత్‌ అమ్మాయిలు ఒక్క గోల్‌ చేయలేకపోయారు. అలా భారత మహిళల హాకీ జట్టు ఫైనల్‌ చేరడంలో విఫలమైంది. అయితే పెనాల్టీ షూటౌట్‌ సమయంలో అంపైర్‌ ప్రవర్తించిన తీరు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆడుతున్నది ఒక సెమీఫైనల్‌ మ్యాచ్‌ అని మరిచిపోయి.. క్లాక్‌టైం మిస్టేక్‌ అని చెప్పడం సిల్లీగా ఉందని.. అంపైర్‌ కావాలనే ఇలా చేసిండేమోననే ఆరోపణలు వస్తున్నాయి.

 క్రికెట్‌లోనూ..

క్రికెట్‌లోనూ..

ఈ క్రమంలోనే సెహ్వాగ్ సైతం ట్విటర్ వేదికగా అంపైర్ తీరును తప్పుబట్టాడు. 'ఆస్ట్రేలియాకు పెనాల్టీ మిస్‌ కాగానే అంపైర్‌ పరిగెత్తుకొచ్చి.. సారీ క్లాక్‌ ఇంకా స్టార్ట్‌ చెయ్యలేదు.. మళ్లీ ఆడండని సాధారణంగా చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. అంపైర్లు ఇలా ఎందుకు పక్షపాతంగా ఉంటారో అర్థం కావడం లేదు. క్రికెట్‌‌లో కూడా అంపైర్ తప్పిదాలు చాలా జరిగేవి. ఇవన్నీ తట్టుకొని సూపర్ పవర్‌గా ఎదిగాం. హాకీలో కూడా ఆ పరిస్థి వస్తుంది. అమ్మాయిలు.. ఓడిపోయినా మనసులు గెలిచారు. వారిని చూస్తే గర్వంగా ఉంది.'అంటూ ఆ వీడియోను షేర్ చేశాడు.

క్షమించండి.. మళ్లీ ఇలా చేయం..

క్షమించండి.. మళ్లీ ఇలా చేయం..

మరోవైపు భారత్‌- ఆస్ట్రేలియా మధ్య జరిగిన మహిళల సెమీస్ మ్యాచ్‌పై విమర్శలు పెరగడంతో అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్‌ కూడా స్పందించింది. 'కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌- ఆస్ట్రేలియా సెమీఫైనల్లో షూటౌట్‌ చిన్న తప్పిదం వల్ల క్లాక్‌ సెట్‌ చేయకముందే ప్రారంభమయింది. అందుకే మళ్లీ ప్రారంభించాం. ఈ తప్పిదానికి మేం క్షమించమని కోరుతున్నాం. ఇలాంటివి జరగకుండా జాగ్రత్తపడతాం.'' అని కామెంట్‌ చేసింది.

Story first published: Saturday, August 6, 2022, 16:39 [IST]
Other articles published on Aug 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X