న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

FIFA World Cup 2022: ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆడిన దిగ్గజ క్రికెటర్ ఎవరో తెలుసా?

Who is the player in history played in both the football and the cricket World Cups?

న్యూఢిల్లీ: క్రీడా ప్రపంచం వేయి కండ్లతో ఎదురు చూసిన సాకర్​ కిక్కు షురూ అయింది. ఖతార్‌‌‌‌‌‌ గడ్డపై ప్రపంచ నేతల ముంగిట.. వేలాది మంది ప్రేక్షకులతో కిక్కిరిసిన స్టేడియంలో ఖతర్నాక్‌‌‌‌ ఓపెనింగ్‌‌‌‌ సెర్మనీతో ఆదివారం రాత్రి ఫిఫా వరల్డ్​ కప్​ మొదలైంది. వరల్డ్‌‌‌‌ క్లాస్‌‌‌‌ ఆర్టిస్టులతో పాటు అరబ్‌‌‌‌ కంట్రీ సంస్కృతి ఉట్టి పడే పెర్ఫామెన్స్‌‌‌‌లు, లేజర్‌‌‌‌ లైటింగ్, బాణాసంచా మోతతో అల్‌‌‌‌ బయత్‌‌‌‌ స్టేడియంలో ఆరంభ వేడుకలు అంబరాన్ని అంటాయి. దాంతో యావత్ క్రీడా ప్రపంచం ఫుట్‌బాల్ ఫీవర్‌లో మునిగి తేలుతోంది. ఇక క్రికెట్ తప్పా మరో ఆటను పట్టించుకోను భారత అభిమానులు సైతం ఈ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌పై ఓ కన్నేసారు. కానీ క్రికెట్‌కు ముడిపడి ఉన్న ఫుట్‌బాల్ అంశాలపైనే మనోళ్ల ఆసక్తి కనబరుస్తున్నారు.

ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆడిన ఏకైక క్రికెటర్..

ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆడిన ఏకైక క్రికెటర్..

ఈ క్రమంలోనే ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆడిన దిగ్గజ క్రికెటర్ గురించి తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. ఇక ఒక ఆటగాడు బహుళ క్రీడలకు ప్రాతినిథ్యం వహించడం కొత్తేం కాదు. ఒలింపిక్స్‌లో ఇలాంటివి చాలా చూస్తుంటాం. కొందరు అథ్లెట్లు పలు ఈవెంట్లలో పాల్గొని పతకాలు కూడా కొట్టారు. టెన్నిస్ ప్లేయర్లను క్రికెట్‌ ఆడిన ఘటనలు ఉన్నాయి. అయితే ఓ దిగ్గజ క్రికెటర్ ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆడాడనే విషయం చాలా మందికి తెలియదు. అతను కూడా ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించినవాడు కావడం మరో విశేషం. అయితే అతను ఎవరో కాదు.. వెస్టిండీస్ దిగ్గజం, ఆల్ టైమ్ గ్రేట్ సర్ వివియన్ రిచర్డ్స్.

1974 ప్రపంచకప్‌లో..

1974 ప్రపంచకప్‌లో..

1970, 80 దశకాల్లో క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన రిచర్డ్స్.. ఫుట్‌బాల్ ప్రపంచకప్ కూడా ఆడాడు. క్రికెట్ కంటే ముందే ఆయన ఫుట్‌బాల్ లో ప్రావీణ్యం సంపాదించాడు. క్రికెట్ ప్రపంచకప్ లు ఆడటానికి ముందే ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో పాల్గొన్నాడు. క్రికెట్ లోకి రిచర్డ్స్ 1974 లో ఎంట్రీ ఇచ్చాడు. అదే ఏడాది నిర్వహించిన ఫుట్‌బాల్ వరల్డ్ కప్ బరిలోకి దిగాడు. కరేబియన్ దీవుల్లోని అంటిగ్వా తరఫున ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడాడు. కానీ ఆ టోర్నీలో ఆంటిగ్వా ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఆ తర్వాత 1975 (తొలి వన్డే ప్రపంచకప్), 1979, 1983 వన్డే ప్రపంచకప్‌లలో కూడా భాగమయ్యాడు.

ఇతరులు ఆడినా..?

ఇతరులు ఆడినా..?

రిచర్డ్స్ కాకుండా క్రికెట్ ఆడుతూనే పలు లీగ్ లకు ఫుట్‌బాల్ ఆడిన క్రికెటర్లు కూడా ఉన్నారు. అయితే వీరెవ్వరూ రిచర్డ్స్ మాదిరిగా ఫిఫా వరల్డ్ కప్ ఆడలేదు. వారిలో ఇంగ్లండ్ దిగ్గజం ఇయాన్ బోథమ్, చార్లెస్ బర్గెస్ ఫ్రై, డెనిస్ కాంప్టన్ (ఈ ఇద్దరిదీ ఇంగ్లాండ్), ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎల్లీస్ పెర్రీ కూడా క్లబ్స్ తరఫున ఫుట్‌బాల్ ఆడింది. భారత ఆటగాళ్లలో కూడా చాలా మందికి ఫుట్‌బాల్ ఆటలో మంచి ప్రావిణ్యం ఉంది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ముందుగా ఫుట్‌బాల్‌నే తన కెరీర్‌గా ఎంచుకున్న విషయం తెలిసిందే.

Story first published: Monday, November 21, 2022, 18:27 [IST]
Other articles published on Nov 21, 2022
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X