న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఛెత్రీకి షాక్.. భారత్‌కు బ్రేక్

Sunil Chhetri’s Goal Goes in Vain as India Lose to New Zealand

హైదరాబాద్: ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ అనూహ్య పరాజయాన్ని చవి చూసింది. బుధవారం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఛెత్రీసేన 1-2తో పరాజయం చవిచూసింది. ఫస్టాఫ్‌లో ఇరు జట్లూ దూకుడైన ఆటను ప్రదర్శించినా గోల్‌ చేయడంలో విఫలమయ్యాయి. కానీ సెకండాఫ్‌ ఆరంభమైన కొద్ది నిమిషాలకే కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి గోల్‌ చేసి భారత్‌ను 1-0 ఆధిక్యంలో నిలిపాడు.

47వ నిమిషంలో కీపర్‌కు పాస్‌ చేసిన బంతిని ఛెత్రి.. కిక్‌ చేయడంతో అది దొర్లుకుంటూ వెళ్లి కివీస్‌ గోల్‌ పోస్ట్‌లో పడింది. అయితే ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. తర్వాతి నిమిషంలోనే న్యూజిలాండ్‌ ప్లేయర్‌ డి జాంగ్‌ గోల్‌ చేయడంతో స్కోరు 1-1తో సమమైంది. దీంతో మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకున్న భారత్..ఫైనల్ బెర్తుకు అడుగుదూరంలో నిలిచింది.

డ్రా ఖాయమనుకుంటుండగా 86వ నిమిషంలో డైయర్‌ గోల్‌ కొట్టి కివీస్‌కు అనూహ్య విజయాన్నందించాడు. కోచ్‌ కాన్‌స్టెంటైన్‌ మరీ ప్రయోగాలకు పోయి మ్యాచ్‌లో ఏకంగా ఏడు మార్పులు చేయడం భారత్‌కు చేటు చేసింది. అదనపు ఐదు నిమిషాల్లో కూడా భారత్‌ మరో గోల్‌ చేయలేకపోయింది. దీంతో చెత్రి సేన ఫైనల్‌ చేరేందుకు ఇతర మ్యాచ్‌ ఫలితాలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్‌ ఆరేసి పాయింట్లతో పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. శుక్రవారం చివరి లీగ్‌ మ్యాచ్‌లో చైనీస్‌ తైపీ, కెన్యా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో కెన్యా ఓడితే భారత్‌ నేరుగా ఫైనల్‌ చేరుతుంది.

చైనీస్‌ తైపీపై 5-0తో, కెన్యాపై 3-0తో గెలిచిన భారత్‌ ఆరు పాయింట్లు, మెరుగైన గోల్‌ తేడాతో మిగతా జట్ల కంటే ముందంజలో ఉంది. శుక్రవారం కెన్యా-చైనీస్‌ తైపీ మ్యాచ్‌ ఫలితాన్ని బట్టి ఫైనల్‌ జట్లేవో నిర్ణయమవుతుంది. గత మ్యాచ్‌కు ముందు తమ ఆట చూడాలంటూ అభిమానులకు ఛెత్రి ఇచ్చిన పిలుపుతో జనాలు స్టేడియానికి పోటెత్తుతున్నారు. కివీస్‌తో మ్యాచ్‌కు టికెట్లన్నీ అమ్ముడైపోయి, స్టాండ్స్‌ నిండుగా కనిపించడం విశేషం.

కివీస్‌తో మ్యాచ్ కోసం చీఫ్ కోచ్ స్టీఫెన్ కాన్సంటటైన్ ఏకంగా ఏడు మార్పులు చేయడం భారత్‌కు అస్సలు కలిసిరాలేదు. కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో భారత్ తొలుత ఆధిపత్యం తన కెరీర్‌లో 101వ మ్యాచ్ ఆడిన ఛెత్రి 62 గోల్స్‌తో జల్టన్ ఇబ్రహీమోవిక్, రొనాల్డో(బ్రెజిల్) సరసన నిలిచాడు.

Story first published: Friday, June 8, 2018, 8:14 [IST]
Other articles published on Jun 8, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X