90శాతం సిద్ధం: ఫిఫా వరల్డ్ కప్ రవాణా మౌలిక వసతులపై రష్యా

Posted By:
Russia 2018 FIFA World Cup transport infrastructure 90% ready

హైదరాబాద్: ఫిఫా 2018 ఆరంభానికి మరో 57 రోజుల టైం మాత్రమే ఉంది. కానీ ఇప్పటికే రష్యాలోని 11 నగరాల పరిధిలో మ్యాచ్‌లు నిర్వహించే పట్టణాలు, నగరాల పరిధిలో రవాణా మౌలిక వసతులు 90 శాతం సిద్దం అయ్యాయి.

ఈ విషయాన్ని ఫిఫా రష్యా లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ అధిపతి కిరిల్ పోల్యకోవ్ ధ్రువీకరించారు. ఇప్పటి నుంచి క్రీడాకారులు, అభిమానులు, వివిధ దేశాల అధికారులకు అవసరమైన విమానాల షెడ్యూల్ ఖరారుపై దృష్టిని కేంద్రీకరించామని చెప్పారు.

ప్రయాణికులకు అదనపు విమాన సర్వీసుల కోసం ఏర్పాట్లు

ప్రయాణికులకు అదనపు విమాన సర్వీసుల కోసం ఏర్పాట్లు

‘ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా ప్రయాణికులకు అదనంగా విమాన సర్వీసుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యాం. ప్రజాదరణ పొందిన విమానయాన రూట్లలో సీట్లు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. అదనపు విమాన సర్వీసులతోపాటు సీటింగ్ కెపాసిటీ కూడా అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. రష్యాలో అత్యధికంగా ప్రజాదరణ పొందిన నగరాలు సరాంస్క్, వోలోగ్రాడ్, సమర, కలింగ్రాడ్ ఉన్నాయి అని చెప్పారు.

మాస్కోతోపాటు 11 నగరాల్లో మ్యాచ్‌ల నిర్వహణ ఇలా

మాస్కోతోపాటు 11 నగరాల్లో మ్యాచ్‌ల నిర్వహణ ఇలా

ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణ కోసం రష్యా 12 స్టేడియాలను ఎంపిక చేసింది. దేశ రాజధాని మాస్కో నగరంతోపాటు సెయింట్ పీటర్స్ బర్గ్, సోచి, కజాన్, సరాంస్క్, కలింగ్రాడ్, వొలోగ్రాడ్, యాకతరింగ్ బర్గ్, సమర నగరాల పరిధిలో ఈ మ్యాచ్ లు నిర్వహిస్తోంది. ఆయా నగరాల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన ఏర్పాటు దాదాపు పూర్తి కావచ్చాయి. మాస్కో నగరంలోనే రెండు స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తారు.

బార్సిలోనాకు దూరం కానున్న ఆండ్రిస్ ఇనైస్టా

బార్సిలోనాకు దూరం కానున్న ఆండ్రిస్ ఇనైస్టా

బార్సిలోనా క్లబ్‌కు దూరం కానున్నట్లు సీనియర్ ప్లేయర్ ఆండ్రిస్ ఇనైస్టా చేసిన ప్రకటన అభిమానులకు అంత రుచికంగా ఉన్నట్లు కనిపించడం లేదు. దశాబ్ద కాలానికి పైగా మిడ్ ఫీల్డర్‌గా బార్సిలోనా జట్టుతో మమేకమైన ఆండ్రిస్ ఇనైస్టా ఇప్పటి వరకు జట్టుకు 30 టోర్నీలను సాధించడంలోనూ కీలక పాత్ర పోషించాడు.

అనూహ్యంగా పాత్ర తగ్గించారన్న ఇనైస్టా

అనూహ్యంగా పాత్ర తగ్గించారన్న ఇనైస్టా

కానీ ఎర్నెస్టో వాల్వెర్డే హయాంలో ప్రస్తుత సీజన్‌లో అనూహ్యంగా తన పాత్ర తగ్గించారని ఆండ్రిస్ ఇనైస్టా తెలిపారు. మరోవైపు ఆండ్రిస్ ఇనైస్టాతో కాంట్రాక్టు పొడిగించేందుకు ఫిలిప్పే కౌంటిన్హో ప్రయత్నాలు సాగిస్తున్నా ఆయన ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఆండ్రిస్ ఇనైస్టా తనకు చైనా సూపర్ లీగ్ సరైన వేదిక అని భావిస్తున్నాడని తెలుస్తోంది. పలు చైనా ఫుట్‌బాల్ క్లబ్‌లు ఆయనతో కాంట్రాక్టుపై సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. తన భవితవ్యంపై తీసుకునే నిర్ణయం బార్సిలోనాపై ప్రభావం చూపబోదన్నాడు.

ఆండ్రిస్ ఇనైస్టా భవితవ్యం చెప్పలేనన్న బార్సిలోనా బాస్

ఆండ్రిస్ ఇనైస్టా భవితవ్యం చెప్పలేనన్న బార్సిలోనా బాస్

బార్సిలోనా జట్టు బాస్ వాల్వర్డే కూడా ఆండ్రిస్ ఇనైస్టా జట్టులో కొనసాగుతాడా? లేదా? అన్న విషయం చెప్పలేనని తేల్చేశాడు.ఆండ్రిస్ ఇనైస్టాతో కలిసి ఆడటం తనకెంతో ప్రత్యేకంగా ఉంటుందని చెప్పాడు. కానీ ఆయన తమతో చివరి మ్యాచ్ ఆడతాడా? లేదా? అన్న విషయం చెప్పలేనని తెలిపాడు. లా లీగా టైటిల్ కోసం అత్యంత సమీపాన ఉన్న బార్సిలోనా జట్టు మంగళవారం సెల్టా విగో జట్టుతో తల పడనున్నది.

Story first published: Tuesday, April 17, 2018, 15:01 [IST]
Other articles published on Apr 17, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి