న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

Pele: పుట్‌బాల్ ప్రపంచాన్ని శాసించిన చాయ్‌వాలా.. తన ఆట కోసం యుద్దమే ఆగింది!

Pele working at a tea shop, know the story of the great footballer

హైదరాబాద్: బ్రెజిల్‌ దిగ్గజం, ఫుట్‌బాల్‌ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకరైన పీలే(82) తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ కాలంగా పెద్ద పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఈ బ్రెజిల్‌ హీరో గత నెలరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. భారత కాలమాన ప్రకారం గురువారం అర్ధరాత్రి ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూసినట్టు పీలే కుటుంబ వర్గాలు పేర్కొన్నాయి. పుట్‌బాల్ ఆటలో పీలే సాధించిన ఘనతల గురించి ఎంత చెప్పినా తక్కువే. దూకుడైన ఆటతో, అద్భుతమైన క్రీడాస్ఫూర్తితో సాకర్‌కు 'అందమైన ఆట' అన్న పేరు తెచ్చాడు ఈ బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ హీరో.

పిలే కూడా చాయ్ వాలానే..

పిలే కూడా చాయ్ వాలానే..

1940 అక్లోబరు 23న జన్మించిన పీలే అసలు పేరు ఎడ్సన్‌ అరెంటస్‌ డొ నసిమెంటో. అతని తండ్రి డాండినో కూడా ఫుట్‌బాలర్‌ కావడంతో పీలే జీన్స్‌లోనే ఈ ఆట ఉంది. బౌరు పట్టణంలో పెరిగిన పీలే పేదరికాన్ని అధిగమించేందుకు చిన్నతనంలో చాయ్‌ దుకాణంలో సర్వర్‌గా పనిచేశాడు. తండ్రి తొలి కోచ్‌గా అనంతరం వాల్డెమార్‌ డి బ్రిటో శిక్షణలో రాటుదేలిన పీలే ప్రొఫెషనల్‌ కెరీర్‌ 1956లో శాంటోస్‌ క్లబ్‌తో ప్రారంభమైంది. క్లబ్‌ ప్లేయర్‌గా అమోఘమైన ఆట తీరుతో ఆకట్టుకొని అనతికాలంలోనే బ్రెజిల్‌ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

యూరప్ వెళ్లకుండా..

యూరప్ వెళ్లకుండా..

1952, 1962 వరల్డ్‌ కప్‌లలో పీలే సత్తాకు అచ్చెరువొందిన యూరప్‌ ప్రముఖ క్లబ్‌లు రియల్‌ మాడ్రిడ్‌, యువెంటస్‌, మాంచెస్టర్‌ యునైటెడ్‌, ఇంటర్‌ మిలాన్‌ భారీ మొత్తం చెల్లించి అతడితో కాంట్రాక్టు కుదుర్చుకొనేందుకు ముందుకొచ్చాయి. దాంతో పీలే దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు బ్రెజిల్‌ నాటి అధ్యక్షుడు జానియో క్వాడ్రస్‌ 1961లో అతడికి 'అధికారిక జాతీయ నిధి' అవార్డును ప్రకటించారు. అలా బ్రెజిల్‌ జాతీయ హీరోగా మారిన పీలే తన ఫుట్‌బాల్‌ కెరీర్‌లో దేశ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.

ఫుట్‌బాల్ ఆటకు అమెరికాలో..

ఫుట్‌బాల్ ఆటకు అమెరికాలో..

ఆటగాడిగా ఎవరెస్ట్ ఎత్తుకు ఎదిగిన పీలే 1974లో ఆటకు గుడ్‌బై చెప్పేశాడు. ఆ తర్వాత అమెరికాలో సాకర్‌కు ప్రాచుర్యం కల్పించేందుకు న్యూయార్క్‌ కాస్మోస్‌ క్లబ్‌తో మూడేళ్లకు ఏడు మిలియన్‌ డాలర్ల మొత్తంతో 1975లో ఒప్పందం చేసుకున్నాడు. అలా నార్త్‌ అమెరికన్‌ సాకర్‌ లీగ్‌లో తన మెరుపులతో యూఎస్‌ ఫ్యాన్స్‌ మది దోచాడు. రిటైరయ్యాక కూడా పీలే తీరికలేని జీవితం గడిపాడు. సామాజిక సేవా కార్యక్రమాలతోపాటు ఫుట్‌బాల్‌కు మరింత పేరు తెచ్చే కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. పలు ఆటోబయోగ్రఫీలను ప్రచురించాడు. ఎన్నో డాక్యుమెంటరీలలో నటించాడు. తన పేరిట 1977లో నిర్మించిన 'పీలే' సినిమాకు సౌండ్‌ ట్రాక్‌ రూపొందించాడు. ఇంకా పలు మ్యూజిక్‌ ఆల్బమ్‌లు కూడా రూపకల్పన చేశాడు.

పీలే పేరు ఎలా వచ్చిందంటే..

పీలే పేరు ఎలా వచ్చిందంటే..

స్కూల్లో చదివే రోజుల్లో నాటి వాస్కోడాగామా ఫుట్‌బాల్‌ జట్టు గోల్‌కీపర్‌ 'బైల్‌' పీలే ఫేవరెట్‌ ఆటగాడు. అయితే బైల్‌....పేరును 'పీలే'గా తప్పుగా పలికేవాడు. దాంతో క్లాస్‌మేట్స్‌ అతడిని 'పీలే'గా పిలవడం ప్రారంభించారు. అలా పీలేకి ఆ పేరు వచ్చింది. వాస్తవంగా పీలేకి అతని తల్లిదండ్రులు బల్బును కనిపెట్టిన థామస్‌ అల్వా ఎడిసన్‌ పేరిట ఎడ్సన్‌ అరనేట్స్‌ డు నసిమెంటో అని పెట్టారు. అయితే ఎడిసన్‌ పేరులోని 'ఐ'ని తీసేసి ఎడ్సన్‌గా నామకరణం చేశాడు. కానీ అతడి బర్త్‌ సర్టిఫికెట్‌లో 'ఐ' అనే పదం పడడంతో పీలే డాక్యుమెంట్లు అన్నింటిలో ఎడిసన్‌ అనే ఉంటుంది.

పిలే ఆట కోసం ఆగిన యుద్ధం..

పిలే ఆట కోసం ఆగిన యుద్ధం..

పీలే ఆటను చూసేందుకు 1969లో నైజీరియాలో జరిగిన అంతర్యుద్ధం 48 గంటల పాటు ఆగింది. ఆ ఏడాది సావోపోలో క్లబ్‌ శాంటోస్‌, నైజీరియాకు చెందిన స్టేషనరీ స్టోర్స్‌ ఎఫ్‌సీ మధ్య ఓ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ లాగోస్‌లో జరగింది. నైజీరియాలో ఆ సమయంలో భీకరమైన అంతర్యుద్ధం జరుగుతోంది. కానీ పీలే మ్యాచ్‌ చూసేందుకు రెండు వర్గాలు 48 గంటలపాటు యుద్ధానికి విరామం ప్రకటించాయి. ఆ మ్యాచ్‌ 2-2తో డ్రా అయింది.

Story first published: Friday, December 30, 2022, 11:10 [IST]
Other articles published on Dec 30, 2022
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X