సందట్లో సడేమియా: సాకర్ కప్ మాటున దండుకునేందుకు హోటళ్లు రెడీ?!!

Posted By:
Over 560 hotels in Russia found to inflate prices ahead of 2018 World Cup

హైదరాబాద్: సందట్లో సడేమియా? అన్నట్లు మరో 60 రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం కానున్నది. ఇదే టైంలో మ్యాచ్‌లు వీక్షించేందుకు వచ్చే అభిమానులు, వివిధ దేశాల జట్ల సభ్యులు, సహాయ సిబ్బంది బస చేసేందుకు హోటళ్లు కావాలి. ఈ నేపథ్యంలో ఆయా హోటళ్ల యాజమాన్యాలు ఇదే అదనుగా ధాటిగా సేవల ధరలను పెంచేశాయి.

1500 హోటళ్లలో అడ్మినిస్ట్రేటివ్ ఉల్లంఘనలే
561 హోటళ్లపై కేసులు నమోదు చేసిన రోస్పొట్రెబ్నాజర్
రష్యా వినియోగదారుల నియంత్రణ సంస్థ రోస్పొట్రెబ్నాజర్ దేశవ్యాప్తంగా 12 వేలకు పైగా హోటళ్ల ధర వరలను, సేవలను పరిశీలిస్తే దిమ్మ తిరిగిపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. 1500 హోటళ్లలో అడ్మినిస్ట్రేటివ్ ఉల్లంఘనలు జరిగాయని గుర్తించింది. 561 హోటళ్లపై కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ఈ వారంలో నమోదైన కేసులు 22 ఉన్నాయి.

 561 హోటళ్లపై కేసులు నమోదు చేసిన రోస్పొట్రెబ్నాజర్

561 హోటళ్లపై కేసులు నమోదు చేసిన రోస్పొట్రెబ్నాజర్

రష్యా వినియోగదారుల నియంత్రణ సంస్థ రోస్పొట్రెబ్నాజర్ దేశవ్యాప్తంగా 12 వేలకు పైగా హోటళ్ల ధర వరలను, సేవలను పరిశీలిస్తే దిమ్మ తిరిగిపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. 1500 హోటళ్లలో అడ్మినిస్ట్రేటివ్ ఉల్లంఘనలు జరిగాయని గుర్తించింది. 561 హోటళ్లపై కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ఈ వారంలో నమోదైన కేసులు 22 ఉన్నాయి.

 హోటళ్లపై 60 లక్షల రూబుళ్ల జరిమానా

హోటళ్లపై 60 లక్షల రూబుళ్ల జరిమానా

113 హోటళ్లలో ఎటువంటి క్లాసిఫికేషన్ సర్టిఫికెట్లు లేవని రష్యా ఫెడరల్ ఏజెన్సీ ఫర్ కన్జూమర్ రైట్స్ ప్రొటెక్షన్ (రోస్పొట్రెబ్నాజర్) ఒక ప్రకటనలో పేర్కొన్నది. అడ్మినిస్ట్రేటివ్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు రోస్పొట్రెబ్నాజర్ సంస్థ సదరు హోటళ్లపై 60 లక్షల రూబుళ్ల (96,060 అమెరికా డాలర్లు) జరిమాన విధించింది 187 హోటళ్ల యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేసింది.

 నాలుగు లక్షల టిక్కెట్లు విక్రయం

నాలుగు లక్షల టిక్కెట్లు విక్రయం

ఇదిలా ఉంటే రష్యాలో జరుగనున్న ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో మ్యాచ్‌లను వీక్షించేందుకు వచ్చే అభిమానుల కోసం 17 లక్షల టిక్కెట్లు కేటాయించింది ఫిఫా. రెండో దశ టిక్కెట్లైన 17 లక్షల దేశీయ, విదేశీ అభిమానులకు ఈ టిక్కెట్లను విక్రయించారు. గత నెల 13వ తేదీన టిక్కెట్ల విక్రయం ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా 3,94,433 టిక్కెట్లు అమ్ముడుపోయాయి.

సాకర్ పట్ల రష్యన్లకే ఎక్కువ అభిమానమా?

సాకర్ పట్ల రష్యన్లకే ఎక్కువ అభిమానమా?

ఇలా విక్రయించిన టిక్కెట్లలో అత్యధికం రష్యాకు చెందిన 2,16,134 మంది, అమెరికాకు చెందిన అభిమానులు 16,462 మంది, అర్జెంటీనా అభిమానులు 15,006, కొలంబియా వాసులు 14,755 మంది, మెక్సికో 14,372 మంది, బ్రెజిల్ 9962, పెరు 9766, చైనా అభిమానులు 6,598 మంది, జర్మనీ వాసులు 5,974, ఆస్ట్రేలియన్లు 5905, భారతీయులు 4509 టిక్కెట్లు కొనుగోలు చేశారని ఫిఫా ఒక ప్రకటనలో వివరించింది.

జనవరిలో ముగిసిన తొలి దశ టిక్కెట్ల విక్రయం

జనవరిలో ముగిసిన తొలి దశ టిక్కెట్ల విక్రయం

2018లో సెప్టెంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైన టిక్కెట్ల విక్రయంలో 16,98,049 మంది అభిమానులకు టిక్కెట్లు కేటాయించింది. అంతర్జాతీయంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానుల డిమాండ్‌లో ఇది 53 శాతం అని పేర్కొంది. రెండో దశలో టిక్కెట్ల విక్రయాన్ని రెండు రకాలుగా విభజించింది ఫిఫా. మొదటి దశ టిక్కెట్ల విక్రయం గతేడాది డిసెంబర్ ఐదో తేదీన ప్రారంభించి జనవరి 31వ తేదీతో ముగించింది.

అక్టోబర్ నెలలోనే ఫాన్ ఐడీల తయారీకి రష్యాలో ఏర్పాట్లు:

అక్టోబర్ నెలలోనే ఫాన్ ఐడీల తయారీకి రష్యాలో ఏర్పాట్లు:

‘ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్‌డ్' నినాదం మేరకు ఈ నెల 13 నుంచి మొదలైన రెండో దశ టిక్కెట్ల విక్రయం వచ్చే నెల మూడో తేదీ వరకు సాగుతుంది. చివరి క్షణంలో జరిగే మూడో దశ టిక్కెట్ల విక్రయం వచ్చేనెల 18 నుంచి మొదలై ఫైనల్స్ మ్యాచ్ ముగిసే వరకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ నినాదం ప్రాతిపదికన సాగుతుంది. టిక్కెట్లు తీసుకునే వారికి నూతన ఫాన్ ఐడీలను సృష్టించడానికి రష్యా కమ్యూనికేషన్స్ అండ్ మాస్ మీడియా శాఖ గత ఏడాది అక్టోబర్ నుంచే చర్యలు చేపట్టింది.

త్వరలో బార్సిలోనా క్లబ్ జట్టుకు సారథ్యం వహించనున్న మెస్సీ:

త్వరలో బార్సిలోనా క్లబ్ జట్టుకు సారథ్యం వహించనున్న మెస్సీ:

వచ్చే లా లీగా సీజన్ ప్రారంభమయ్యేలోగా ఐదుగురు ప్లేయర్లను బయటకు సాగనంపాలని బార్సిలోనా ఫార్వర్డ్ ప్లేయర్ లియానెల్ మెస్సీ.. జట్టు కోచ్ కం మేనేజర్ ఎర్నెస్టో వాల్వెర్డేకు స్పష్టం చేశారు. రియల్ మాడ్రిడ్ జట్టు కంటే 15 పాయింట్లు ఆధిక్యంలో ఉన్న బార్సిలోనా జట్టు మరో వారం రోజుల్లో ‘లా లీగా' టైటిల్' కొట్టేయాలని కలలు కంటోంది. ఆండ్రే గోమ్స్, పాకో అల్సాసర్, అలెక్స్ విడల్, లుకాస్ డిగ్నే, డెనిస్ సౌరజ్ అనే ఆటగాళ్లను క్లబ్ జట్టు నుంచి పంపేయాలని లియానెల్ మెస్సీ అభ్యర్థించాడు. జట్టు కెప్టెన్ గా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్న మెస్సీ ప్రతిపాదనలను బార్సిలోనా జట్టు మేనేజ్మెంట్ తోసిపుచ్చలేదు.

Story first published: Friday, April 13, 2018, 16:50 [IST]
Other articles published on Apr 13, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి