న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

'నేను తప్పుకోను.. నేరం నాదంటే ఒప్పుకోను'

Mutko temporarily steps aside as Russian Football president to fight IOC ban

హైదరాబాద్: రష్యన్ ఫుట్‌బాల్ యూనియన్ (ఆర్‌ఎఫ్‌ఎస్) ప్రెసిడెంట్ పదవీ నుంచి విటలీ ముట్కో తప్పుకోబోతున్నాడు. అతనికి ఫ్యూచర్ ఒలింపిక్స్ (ఐఓసీ) జీవిత కాలం నిషేదం విధించిన నేపథ్యంలో మరోసారి తనపై విచారణ జరపమంటూ వాదిస్తున్నాడు. డిసెంబరు 25 సోమవారం రష్యన్ ముఖ్య కార్య నిర్వహణ బోర్డు అతనిపై ఈ తీర్పును ప్రకటించింది.

రష్యా ఉప ప్రధానిగా కొనసాగుతున్న విటలీ ముట్కోపై భవిష్యత్ ఒలింపిక్ క్రీడలపై నిషేదింపబడ్డారు. అంటే ఆ క్రీడలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదన్నమాట. నెలరోజుల పాటు జరిగిన విచారణ అనంతరం ఇచ్చిన స్క్మిడ్ బృందం రష్యన్ క్రీడా శాఖకు నివేదికను అందజేసింది. దీని ఆధారంగా యాంటీ డోపింగ్ విషయమై ముట్కోను నేరస్థుడిగా పరిగణించిన ఐఓసీ నిషేదాజ్ఞలు జారీ చేసింది.

2014‌ సోచిలో జరిగిన వింటర్ ఒలింపిక్స్‌లో అప్పటి క్రీడా మంత్రిగా విధులు నిర్వర్తించిన ముట్కోను ఇందుకు బాధ్యుడిగా పేర్కొంది. ఈ కేసు పునర్విచారణ నిమిత్తం కోర్ట్ ఆఫ్ అర్బిరేషన్‌ను (సీఏఎస్)ను ముట్కో సంప్రదించనున్నారు. 'డిసెంబరు 27 నుంచి నేను తాత్కాలికంగా విధుల నుంచి తప్పుకోబోతున్నాను. తద్వారా లీగల్ విచారణకు ఏ మాత్రం ఇబ్బంది వాటిల్లదని' పేర్కొన్నాడు. ఆర్నెళ్ల పాటు ముట్కో అందుబాటులో లేకపోవడంతో వేరొకరు ఈ పదవిలో కొనసాగనున్నారు. విరామానంతరం ఖచ్చితంగా తిరిగి తన పదవిలో కొనసాగుతాననే నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నాడు.

ఒకవేళ ఫిఫా ఫుట్‌బాల్ యూనియన్ గనుక నన్ను రాజీనామా చేయొద్దు. విధుల్లోనే కొనసాగమని ఆదేశిస్తే డిప్యూటీ ప్రీమియర్ పదవిలోనే కొనసాగదలచినట్లు పేర్కొన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 26, 2017, 11:35 [IST]
Other articles published on Dec 26, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X