న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

కోల్‌కతాలో కొత్త నినాదం: ‘మెస్సీ విల్‌ డూ ఏ టెండూల్కర్‌’

By Nageshwara Rao
Messi will do a Tendulkar, says Kolkata’s Argentina Fan Club

హైదరాబాద్: రష్యా వేదికగా మరికొన్ని గంటల్లో ఫిఫా వరల్డ్ కప్ ఆరంభం కానున్న నేపథ్యంలో దక్షిణ కోల్‌కతాలోని అర్జెంటీనా ఫ్యాన్ క్లబ్ అభిమానులు చేస్తోన్న ప్రార్ధన ఏంటో తెలుసా? 'మెస్సీ విల్‌ డూ ఏ టెండూల్కర్‌'.

గతవారం టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఓ ఇంటర్యూలో ఆర్జెంటీనా స్టార్‌ ప్లేయర్ లియోనల్‌ మెస్సీ ఈ సారీ ప్రపంచకప్‌ను ముద్దాడాలనే కోరిక బయటపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో కోల్‌కతాలోని అర్జెంటీనా ఫ్యాన్‌ క్లబ్‌ వ్యవస్థాపకుడు‌ ఉత్తమ్‌ సాహా ఆధ్వర్యంలో మెస్సీకి మద్దతుగా 'మెస్సీ విల్‌ డూ ఏ టెండూల్కర్‌' ఈ నినాదాన్ని నినదించారు.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

టీమిండియా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మాదిరిగానే లియోనల్‌ మెస్సీ కూడా తన దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. తమ కెరీర్‌లో సచిన్‌తో పాటు మెస్సీకి కూడా వరల్డ్ కప్ అందని ద్రాక్షలాగే మగిలింది.

అయితే, 2011లో సచిన్‌ తాను ఆడిన చివరి వన్డే వరల్డ్‌కప్‌లో టైటిల్‌ గెలిచి ఆటకు ఘనంగా వీడ్కోలు పలికాడు. ఇప్పుడు మెస్సీ కూడా తాను ఆడే చివరి వరల్డ్ కప్ గెలిచి సచిన్‌ దారిలో నడుస్తాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా 56 ఏళ్ల ఉత్తమ్‌ సాహా మాట్లాడుతూ "తన కెరీర్ చరమాంకంలో సచిన్ టెండూల్కర్ ఎలాగైతే (2011) వరల్డ్ కప్ గెలిచాడో, అలాగే మెస్సీ కూడా ఈ వరల్డ్ కప్‌ను గెలుస్తాడనేది నా నమ్మకం" అని తెలిపాడు. ఇక్కడ సచిన్‌కు మెస్సీకి అనేక సారుప్యత ఉందని తెలిపాడు.

సచిన్, మెస్సీల జెర్సీ నంబర్‌ ఒకటే. అంతేకాదు జట్టులోని సహచర ఆటగాళ్లలో స్పూర్తి నింపడం, జట్టు కఠిన సమయంలో ఉన్నప్పుడు అన్ని బాధ్యతలు భుజాలపై వేసుకోవడం వీరిద్దరికి ఉన్న కామన్ పాయింట్ అని చెప్పుకొచ్చాడు.

ఈ క్లబ్‌ని 2002లో ఏర్పాటు చేశామని, ప్రస్తుతం ఈ క్లబ్‌లో 786 మంది సభ్యులుగా ఉన్నారని తెలిపాడు. ఈ క్లబ్ ద్వారా పుట్‌బాల్‌కు చెందిన అనేక ఈవెంట్లను నిర్వహిస్తామని తెలిపాడు. ఈ ఏడాది మెస్సీ, మారడోనా పుట్టినరోజులను ఘనంగా నిర్వహించామని తెలిపాడు.

కాగా, 2014లో బ్రెజిల్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో అద్భుత ఆట తీరుతో అర్జెంటీనా జట్టు ఫైనల్‌కి చేరింది. బ్రెజిల్‌లోని మరకానా స్టేడియంలో జర్మనీతో జరిగిన ఫైనల్లో అనూహ్యంగా 0-1 తేడాతో ఓటమిపాలైంది. కాగా, 2018 ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా జూన్ 14న రష్యా, సౌదీ అరేబియా మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

Story first published: Wednesday, June 13, 2018, 19:24 [IST]
Other articles published on Jun 13, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X