న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

వరల్డ్‌కప్ క్వార్టర్ ఫైనల్: బ్రెజిల్ Vs బెల్జియం, నెయ్‌మార్ చరిత్ర సృష్టించేనా?

By Nageshwara Rao
Kompany: Belgium losing no sleep over Brazils individual talent

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌ మరో అంకానికి రంగం సిద్ధమైంది. ముప్ఫై రెండు జట్లతో మొదలైన టోర్నీ అత్యుత్తమంగా నిలిచిన ఆఖరి ఎనిమిది జట్లు క్వార్టర్‌ ఫైనల్స్‌‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో భాగంగా శుక్రవారం ఉరుగ్వే-ఫ్రాన్స్, బ్రెజిల్‌-బెల్జియం జట్లు తలపడనున్నాయి.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఆరో వరల్డ్ కప్‌పై కన్నేసిన బ్రెజిల్‌.. భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది. వీటిలో సెమీస్‌‌‌కు తొలుత రెండు దక్షిణ అమెరికా (ఉరుగ్వే, బ్రెజిల్‌) దేశాలు అర్హత సాధిస్తాయా లేక రెండు యూరప్‌ దేశాలు (ఫ్రాన్స్, బెల్జియం) ముందంజ వేస్తాయో తెలియాలంటే రాత్రి వరకు ఆగాల్సిందే.

 ఫేవరేట్‌గా బ్రెజిల్

ఫేవరేట్‌గా బ్రెజిల్

ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ ఫేవరేట్ అయినప్పటికీ పుట్‌బాల్ విశ్లేషకులు మాత్రం బెల్జియం జట్టుని తక్కువగా అంచనా వేయకూడదని అంటున్నారు. టోర్నీలో ఇప్పటివరకు బెల్జియం ఆడిన మ్యాచ్‌లే ఇందుకు నిదర్శనం. నౌకట్‌లో జపాన్‌‌తో జరిగిన మ్యాచ్‌లో ఊహించని విధంగా చివర్లో పుంజుకుని మ్యాచ్‌ని తనవైపుకి తిప్పుకుంది. ఫిఫా ర్యాంకుల్లో 2, 3 స్థానాల్లో ఉన్న ఈ రెండు జట్ల మధ్య క్వార్టర్స్‌లో పోరు రసవత్తరంగా ఉండనుంది. టోర్నీలో ఇప్పటివరకు ఏడు గోల్స్‌ చేసిన బ్రెజిల్‌... ప్రత్యర్థులకు ఒక్కటే ఇచ్చింది. మరోవైపు బెల్జియం ఏకంగా 12 గోల్స్‌ కొట్టి... నాలుగు ఇచ్చింది. బెల్జియంతో జరిగే క్వార్టర్‌ఫైనల్లో మ్యాచ్‌లో అభిమానుల కళ్లన్నీ నెయ్‌మార్‌పైనే.

నెయ్‌మార్ ఫామ్‌లోకి

నెయ్‌మార్ ఫామ్‌లోకి

కీలక సమయంలో ఈ స్టార్‌ ఆటగాడు ఫామ్‌లోకి వచ్చాడు. నెయ్‌మార్‌కి తోడు గాబ్రియెల్‌ జీసస్‌ కూడా మెరిస్తే తిరుగుండదు. బ్రెజిల్ జట్టులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆ జట్టు డిఫెండర్లు గురించి. మిరిండా, తియాగో సిల్వాలు గోడలా నిలుస్తూ ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వట్లేదు. ఈ ప్రపంచకప్‌లో బ్రెజిల్‌ ఇప్పటివరకు ఒక్క గోల్‌ మాత్రమే ఇచ్చిందంటే ఆ జట్టు డిఫెన్స్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి బ్రెజిల్ డిఫెన్స్‌ను బెల్జియం స్టార్లు హజార్డ్, లుకాకు, మెర్టెన్స్‌లు ఏమేరకు ఛేదిస్తారో చూడాలి. మరోవైపు నెయ్‌మార్‌, కౌటినో, గాబ్రియెల్‌ జీసన్‌, ఫిర్మినోలతో కూడిన అత్యుత్తమ ఎటాకింగ్‌ బ్రెజిల్‌ సొంతం.

బ్రెజిల్‌‌కు కలిసొచ్చే అంశం అదే

బ్రెజిల్‌‌కు కలిసొచ్చే అంశం అదే

కాగా, టోర్నీలో ఇప్పటివరకు ఒక్క అగ్రశ్రేణి జట్టు కూడా బ్రెజిల్‌తో తలపడక పోవడం కలిసొచ్చే అంశం. నాకౌట్‌లో జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాదిరి ఆధిక్యం కోల్పోతే కోలుకోవడానికి వీలుండదు. మ్యాచ్‌ మ్యాచ్‌కు జోరు పెంచుతున్న బ్రెజిల్‌ను కాదని సెమీఫైనల్లో స్థానం సంపాదించాలంటే బెల్జియం గొప్పగా పోరాడాల్సి ఉంటుంది. ముఖ్యంగా బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్‌మార్‌ను బెల్జియం ఆటగాళ్లు ఎలా అడ్డుకున్నారన్నదే ప్రధానాంశం. టోర్నీలో ఇప్పటివరకు రెండు గోల్స్‌ కొట్టడంతో పాటు ఆ జట్టు క్వార్టర్స్‌ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. మెక్సికోపై ప్రిక్వార్టర్స్‌లో చక్కని గోల్‌ కొట్టడమే కాదు.. మరో గోల్‌లో సహకారమందించాడు.

నెయ్‌మార్‌ను నిలువరించడం ఏ జట్టుకైనా కష్టమే

నెయ్‌మార్‌ను నిలువరించడం ఏ జట్టుకైనా కష్టమే

తాను అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నప్పుడు నెయ్‌మార్‌ను నిలువరించడం ఏ జట్టుకైనా కష్టమే. అలాంటిది క్వార్టర్స్‌లో నెయ్‌మార్ ఎలా ఆడతాడో చూడాలి. మరోవైపు ఆటగాళ్లంతా అద్భుత ఫామ్‌లో ఉండటంతో బెల్జియంను ‘గోల్డెన్‌ జనరేషన్‌' జట్టుగా అభివర్ణిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్‌ను ఓడిస్తే 1986 తర్వాత బెల్జియం సెమీస్‌కు చేరినట్లవుతుంది. బ్రెజిల్‌కు ఇది వరుసగా ఏడో వరల్డ్‌కప్ క్వార్టర్‌ఫైనల్‌. ఈ క్రమంలో రెండు సార్లు (2006, 2010) మాత్రమే ఈ దశలో ఓడిపోయింది.

* బ్రెజిల్‌ (vs) బెల్జియం రాత్రి గం.11.30 నుంచి

* సోనీ ఈఎస్‌పీఎన్, సోనీ టెన్‌-2, 3లలో ప్రత్యక్ష ప్రసారం

Story first published: Friday, July 6, 2018, 11:35 [IST]
Other articles published on Jul 6, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X