హైదరాబాద్: యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. నార్త్ సౌత్ అంటూ తేడా లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా క్రేజ్ ఖండంతరాలు ధాటి వరల్డ్ బెస్ట్ ఫుట్ బాల్ టోర్నీ.. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌కు తాకింది. ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన మాంచెస్టర్ సిటీ క్లబ్ కేజీఎఫ్ ఫీవర్‌లో మునిగి తేలుతోంది.
సోషల్ మీడియా వేదికగా తమ ఆటగాళ్లను కేజీఎఫ్ సినిమాతో పోల్చుతూ ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. తమ జట్టుకు చెందిన స్టార్ ఆటగాళ్లు కెవిన్ డీ బ్రూన్, గుండోగన్, ఫిల్ ఫోడెన్‌లను తమ కేజీఎఫ్‌గా అభివర్ణిస్తూ ఫొటోలను ఎడిట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌కు భారత అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఫ్యాన్సే కాదు కేజీఎఫ్ హిందీ వర్షన్‌లో నటించిన బాలీవుడ్ యాక్టర్ ఫర్హాన్ అక్తర్ కూడా ఫిదా అయ్యాడు. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. 'మనం నటించిన చిత్రానికి గుర్తింపు లభిస్తే అంతకంటే ఆనందం ఏం ఉంటుంది'అని రాసుకొచ్చాడు. ఇక ఫర్షాన్ అక్తర్ మాంచెస్టర్ సిటీ క్లబ్‌కు హార్డ్‌కోర్ ఫ్యాన్.
ఒక్క సినిమాతో కన్నడ నటుడు యశ్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. మూడేళ్ల కింది వరకు యశ్ కేవలం కన్నడలోనే హీరో. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోగా ఎదిగారు. ఇక కేజీఎఫ్‌తో రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన యశ్.. ఇప్పుడు కేజీఎఫ్ 2 మూవీతో ప్రపంచవ్యాప్తంగా ఆదరణను అందుకుంటున్నాడు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్‌లో టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. అంతేకాదు హిందీలో కూడా ఆల్ టైమ్ ఫస్ట్ డే రికార్డు క్రియేట్ చేసింది.