న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ISL 2020-21: బెంగళూరు‌కు షాక్.. జంషెడ్‌పూర్ విక్టరీ

ISL 2020-21: Jamshedpur hold on to sixth spot after edging Bengaluru in five-goal thriller

గోవా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐఎస్‌ఎల్) 2020-21 సీజన్ తుది దశకు చేరుకుంది. జంషెడ్ పూర్ ఫుట్‌బాల్ క్లబ్ లీగ్ దశను గెలుపుతో ముగించింది. గురువారం తిలక్ మైదానం వేదికగా జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ 3-2తో బెంగళూరు ఎఫ్‌సీని ఓడించింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో ఆరో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక బెంగళూరు ఎఫ్‌సీ ఏడో స్థానంతో సరిపెట్టుకుని ఈ సీజన్‌ను ముగించింది.

ఐఎస్‌ఎల్ చరిత్రలోనే ఏన్నడు లేని విధంగా ఫస్టాఫ్‌లో మూడు గోల్స్ కొట్టి ఔరా అనిపించిన జంషెడ్ పూర్ ఎఫ్‌సీ.. నయా రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. మ్యాచ్ ప్రారంభమైన 16వ నిమిషంలోనే స్టీఫెన్ ఈజ్ గోల్‌తో జంషెడ్ పూర్ ఖాతా తెరవగా.. 34వ నిమిషంలో సిమిన్లెన్ డాంగుల్ మరో గోల్‌తో ఆధిక్యాన్ని డబుల్ చేశాడు. మరో 7 నిమిషాల వ్యవధిలో డేవిడ్ గ్రాండే మరో గోల్ కొట్టడంతో జంషెడ్ పూర్ ఆధిక్యం 3-0తో ట్రిపుల్ అయింది. ఈ ఆధిక్యంతోనే ఫస్టాఫ్ ముగించింది.

ఇక సెకండాఫ్‌లో తేరుకున్న బెంగళూరు ఎఫ్‌సీ.. ప్రత్యర్థికి ధీటుగా బదులిచ్చింది. 62వ నిమిషంలో ఫ్రాన్సిస్కో గోల్‌తో ఖాతా తెరిచిన బెంగళూరు.. మరో 9 నిమిషాల వ్యవధిలోనే కెప్టెన్ సునీల్ ఛెత్రీ గోల్ కొట్టడంతో జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ ఆధిక్యం 3-2కు తగ్గింది. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా గోల్స్ రాకపోవడంతో జంషెడ్ పూర్ విజయం లాంఛనమైంది. బెంగళూరు ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతవ్వగా.. హైదరాబాద్ ఎఫ్‌సీ, నార్త్ ఈస్ట్ యునైటెడ్, గోవా ఎఫ్‌సీ మ్యాచ్ ఫలితాలపై జంషెడ్‌పూ భవితవ్యం ఆధారపడి ఉంది.

Story first published: Friday, February 26, 2021, 12:18 [IST]
Other articles published on Feb 26, 2021
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X