న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

రష్యాకు తొలి జట్టు ఇరాన్: 24 గంటల్లో 1.64 లక్షల టిక్కెట్ల విక్రయం

Iranian football team will be first to arrive in Russia for World Cup

హైదరాబాద్: వచ్చే జూన్ 14వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు రష్యాలో జరిగే ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనేందుకు తొలుత ఇరాన్ జట్టు రానున్నదని రష్యా డిప్యూటీ ప్రధానమంత్రి విటాల్యే ముట్కో చెప్పారు. సాకర్ కప్‌లో పాల్గొనే జట్లకు స్వాగతం పలికి, ఆతిథ్యం ఇచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయా నగరాల అధికారులు, పాలక మండళ్ల అధినేతలతో సమావేశం అయ్యారు.

జూన్ ఐదో తేదీన రష్యాకు ఇరాన్ జట్టు

జూన్ ఐదో తేదీన రష్యాకు ఇరాన్ జట్టు

ఇరాన్ జట్టు తొలుత జూన్ ఐదో తేదీన రష్యాలో అడుగు పెట్టనుందని ముట్కో చెప్పారు. ఇరాన్ జట్టుకు మాస్కో నగర శివారుల్లోని బాకోవ్కాలో శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. సాధారణంగా ఈ బాకోవ్కా శిబిరాన్ని మాస్కోకు చెందిన లొకోమోటివ్ జట్టు వినియోగిస్తుంది. ప్రపంచ కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చేందుకు రష్యా 11 నగరాలను ఎంపిక చేసింది. వాటిలో దేశ రాజధాని మాస్కోతోపాటు సెయింట్ పీటర్స్ బర్గ్, సోచి, కజాన్, శరాంస్క్, కలింగ్రాడ్, వొలోగ్రాడ్, రొస్టొవ్ ఆన్ డాన్, నిజ్యీ నొవొగొరోడ్, యాకతరింగ్ బర్గ్, సమరా నగరాల్లోని స్టేడియంలను ఎంపిక చేసింది.

రష్యాకు ఇరాన్ పర్యాటకుల తాకిడి వెల్లువ

రష్యాకు ఇరాన్ పర్యాటకుల తాకిడి వెల్లువ

ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్ నేపథ్యంలో ఇరాన్ నుంచి భారీగా పర్యాటకుల తాకిడి ఉంటుందని రష్యా పర్యాటక సంస్థ అధినేత ఒలెగ్ సాఫోనోవ్ అంచనా వేశారు. ‘2018లో ఇరాన్ పర్యాటకుల జోరు భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నాం. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల మేరకు పర్యాటక బ్రుందాలకు ‘వీసా ట్రీ' వసతి కల్పిస్తున్నామని సాఫోనోవ్ చెప్పారు. 2017 మార్చిలో మాస్కోకు ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ వచ్చినప్పుడు ఈ మేరకు ఇరాన్, రష్యా దేశాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఇరాన్‌కు రష్యన్లు వీసా లేకుండానే వెళ్లొచ్చు.తాము కూడా గణనీయంగా వీసా నిబంధనలను సరళతరం చేశామని సాఫోనోవ్ తెలిపారు.

భారీగా రష్యాకు ఇరాన్ పర్యాటకులు

భారీగా రష్యాకు ఇరాన్ పర్యాటకులు

‘ఇరాన్ పర్యాటకులు భారీగా రష్యాకు వస్తారని మాకు సమాచారం ఉంది' అని సొఫోనోవ్ అని చెప్పారు. వివిధ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల ప్రాతిపదికన ఈ వీసా ప్రక్రియనే మేం చేపట్టాం. ప్రస్తుత సంఖ్యలో రష్యాకు వచ్చే పర్యాటకుల సంఖ్య చాలా ప్రోత్సాహకరంగా ఉంది' సాఫోనోవ్ చెప్పారు. వరల్డ్ కప్ సందర్భంగా రష్యాకు పర్యాటకుల తాకిడి పెరుగుతుందన్నారు. గణనీయ స్థాయిలో ఇరానియన్ అభిమానులు, పర్యాటకులు రష్యాకు వస్తారని అంచనా వేశారు.

 జూన్ 15వ తేదీన మొరాకోతో తలపడనున్న ఇరాన్

జూన్ 15వ తేదీన మొరాకోతో తలపడనున్న ఇరాన్

ఇరాన్ జట్టు జూన్ 15వ తేదీన సెయింట్ పీటర్స్ బర్గ్ స్టేడియంలో మొరాకో జట్టుతో తల పడనున్నది. ఈ మ్యాచ్‌లో గెలుపొందిన జట్టు జూన్ 20వ తేదీన కజన్ లో స్పెయిన్, 25వ తేదీన సరాంస్క్‌లో పోర్చుగల్ జట్టుతో తలపడతాయి. చివరిక్షణంలో టిక్కెట్లు చివరిగా జూలై 15వ తేదీన అందుబాటులో ఉన్న వారికి విక్రయించనున్నట్లు ఫిఫా ఒక ప్రకటనలో తెలిపింది. ముందుగా అందుబాటులోకి వచ్చిన అభిమానులకు మాత్రమే టిక్కెట్లు ఇస్తామని పేర్కొంది. అందుకు అభిమానులు ఫ్యాన్ - ఐడీ తప్పక సమర్పించాలని స్పష్టం చేసింది. సాకర్ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న వేళ భద్రత కోసం ‘ఫ్యాన్ - ఐడీ'కార్డులను జారీ చేస్తున్నారు.

24 గంటల్లో 1.64 లక్షలకు పైగా టిక్కెట్లు విక్రయం

24 గంటల్లో 1.64 లక్షలకు పైగా టిక్కెట్లు విక్రయం

గత బుధవారం నుంచి 24 గంటల వ్యవధిలో ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లకు సంబంధించి 1.64 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడు పోయాయని ఫిఫా ఒక ప్రకటనలో తెలిపింది. మూడో (తుది) దశ టిక్కెట్ల విక్రయంలో కేవలం ఒక్కరోజులో 1,64,136 టిక్కెట్లు అమ్ముడు పోయాయని తెలిపారు. తుది మ్యాచ్ జరిగే వరకు టిక్కెట్లు విక్రయం జరుగుతాయి. ఇప్పటివరకు విక్రయించిన టిక్కెట్లలో రష్యాలో 87,902 మందికి, అర్జెంటీనాకు 7,740, మెక్సికోకు 6,598, బ్రెజిల్‌కు 6,198, అమెరికాకు 5,780, జర్మనీకి 5,181, పెరుకు 3,799, కొలంబియాకు 3,756, చైనాకు 2,930, ఈజిప్టులో 2,370, భారతదేశానికి 1,905 మంది ఫుట్‌బాల్ అభిమానులకు టిక్కెట్లు కేటాయించామని ఫిఫా తెలిపింది. ఫిఫా వరల్డ్ కప్ సంరంభం ప్రారంభం కావడానికి మరో 50 రోజుల టైం మాత్రమే ఉంది.

Story first published: Tuesday, April 24, 2018, 14:15 [IST]
Other articles published on Apr 24, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X