న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫుట్‌బాల్‌తో అదరగొట్టిన భారత కుర్రాళ్లు

India U-16 Finish WAFF Championship Campaign With 3-0 Win Against Yemen

న్యూ ఢిల్లీ: డబ్ల్యూఏఎఫ్‌ఎఫ్‌ అండర్‌-16 ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత కుర్రాళ్లు జైత్రయాత్ర కొనసాగించారు. గత మ్యాచ్‌లో ఇరాక్‌కు షాకిచ్చిన భారత కుర్రాళ్లు.. చివరి మ్యాచ్‌లో యెమెన్‌పై ఘనవిజయం సాధించారు. ఇలా మంగళవారం జోర్డాన్‌లోని అమన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో యెమెన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షో కనబరిచిన భారత్‌ 3-0తో ఘనవిజయం సాధించింది.

ఐదు దేశాల డబ్ల్యుఏఎ్‌ఫఎఫ్‌ అండర్‌-16 చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌ 37వ నిమిషంలో హర్‌ప్రీత్‌ సింగ్‌ భారత్‌కు తొలి గోల్‌ అందించాడు. 47వ నిమిషంలో రిడ్జ్‌ డెమెలో హెడర్‌తో రెండో గోల్‌ సాధించాడు. ఆ తర్వాత మరో నిమిషంలోనే రోహిత్‌ దాను జట్టుకు మూడో గోల్‌ అందించడంతో జట్టు విజయం ఖాయమైంది. ఏఎఫ్‌సీ అండర్‌-16 చాంపియన్‌షిప్‌కు సన్నాహకంగా జరిగిన ఈ టోర్నీలో భారత కుర్రాళ్లు 3మ్యాచ్‌లు గెలిచి ఓ మ్యాచ్‌ ఓడారు.

ఐదు దేశాలు పాల్గొన్న ఈ టోర్నీలో మూడు మ్యాచ్‌లు గెలిచి, జపాన్‌తో ఒక మ్యాచ్‌లో త్రుటిలో ఓడింది. జోర్డాన్‌లో జరిగిన మ్యాచ్‌లలో అండర్ 16 జట్టు మూడు గెలిచి.. ఒక ఓటమిని పొందింది.

త్వరలో మలేసియాలో జరిగే ఏఎఫ్‌సీ అండర్‌-16 ఛాంపియన్‌షిప్‌కు సన్నాహకంగా భారత్‌ ఈ టోర్నీ ఆడింది. గ్రూప్ సీలో భాగమైన టీమిండియా.. ఇరాన్ ఇండోనేషియాలతో ఆడేదానికంటే ముందుగానే కాంపైన్‌ను మొదలుపెట్టనుంది. ఈ టోర్నమెంట్లో సెమీ ఫైనల్‌కు చేరుకోగలిగితే 2019 ఫిఫా అండర్ 17 ప్రపంచ కప్‌కు అర్హత సాధించినట్లే.

Story first published: Wednesday, August 8, 2018, 11:49 [IST]
Other articles published on Aug 8, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X