గన్నుతో బెదిరించి పాయింట్ సొంతం చేసుకున్న ఫుట్‌బాల్ జట్టు

Posted By:
Greek game abandoned after PAOK club president enters football pitch with handgun

హైదరాబాద్: గ్రీక్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భయానక గెలుపు చోటు చేసుకుంది. టౌంబా స్టేడియంలో 30,000 మంది వీక్షిస్తున్న మ్యాచ్‌లో ఏకంగా రిఫరీకే గన్ను చూపించి పాయింట్ సొంతం చేసేసుకున్నాడు మరో జట్టుకు చెందిన వ్యక్తి. అసలు జరిగింది ఇలా.. ఆదివారం జరిగిన గ్రీక్ సూపర్‌లీగ్ మ్యాచ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆతిథ్య పీఏఓకే, ఏఈకే ఏథెన్స్ టీమ్స్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్ 90వ నిమిషంలో పీఏఓకే డిఫెండర్ ఫెర్నాండో వారెలా చేసిన గోల్‌ను రిఫరీ ఆఫ్‌సైడ్‌గా ప్రకటించాడు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన పీఏఓకే టీమ్ ఓనర్ ఇవాన్ సావిడీస్ గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు. అతని జేబులో ఓ గన్ కూడా ఉంది. రిఫరీ గియోర్గోస్ కొమినోస్‌ను సావిడీస్ గన్‌తో బెదిరించాడు.

నువ్వు అయిపోయావ్ అంటూ కొమినోస్‌ను పీఏఓకే టీమ్ టెక్నికల్ డైరెక్టర్ లుబోస్ మిచెల్ బెదిరించడం గమనార్హం. ఈ ఘటన తర్వాత రిఫరీ కొమినోస్ తన నిర్ణయాన్ని మార్చుకొని పీఏఓకేకు గోల్ ఇచ్చాడు. దీనిని ప్రత్యర్థి ఏఈకే ఏథెన్స్ నిరసిస్తూ.. గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లిపోయింది. మిగిలిన మ్యాచ్ పూర్తి చేయాల్సిందిగా రిఫరీ కోరినా.. ఆ టీమ్ మళ్లీ రాలేదు.

అంతేకాదు తమ డైరెక్టర్ వాసిలిస్ డిమిత్రియాడిస్‌పైనా పీఏఓకే టీమ్ ఓనర్ సావిడిస్ దాడి చేశాడని ఏఈకే ఏథెన్స్ టీమ్ ఆరోపించింది. ఈ ఘటనపై రిఫరీ కొమినోస్ గ్రీక్ ఫుట్‌బాల్ ఫెడరేషన్‌కు నివేదిక ఇవ్వనున్నాడు. దీనిపై సదరు ఫెడరేషన్ 3-0తేడాతో గెలిచిందంటూ ఇప్పటికే ఫలితాన్ని ప్రకటించేయడంతో గెలుపు సందిగ్ధంగా మారింది.

Story first published: Monday, March 12, 2018, 15:08 [IST]
Other articles published on Mar 12, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి