Shahid Hakeem: భారత ఫుట్‌బాల్ దిగ్గజం కన్నుమూత

కర్ణాటక: భారత ఫుట్‌బాల్ దిగ్గజం షాహిద్ హకీమ్(82) గుండెపోటుతో కన్ను మూశారు. గుల్బర్గాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. షాహిద్ హకీమ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హకీమ్ సాబ్‌గా గుర్తింపు పొందిన ఆయన.. భారత ఫుట్‌బాల్‌కు ఐదు దశాబ్దాల పాటు సేవలు అందించారు. 1950-1960 మధ్య భారత్ తరఫున హకీమ్ ఫుట్ బాల్ మ్యచ్‌లో ఆడారు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున షాహిద్ హకీమ్ ప్రాతినిధ్యం వహించారు. ఫిఫా మ్యాచ్‌లకు అంతర్జాతీయ రిఫరీగా కూడా వ్యవహరించారు.
వాయుసేనలో స్క్వాడ్రాన్ లీడర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన హకీమ్.. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో తొలిసారి భారత ఫుట్‌బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో జట్టు కోచ్‌గా ఆయన తండ్రి సయిద్ అబ్దుల్ రహీమ్ ఉన్నారు. అయితే హకీమ్ జట్టులో ఉన్నా.. ఆ సమయంలో ఆడే అవకాశం రాలేదు. దేశీయ ఫుట్‌బాల్ టోర్నీల్లో కోచ్‌గా హకీమ్ కీలక పాత్ర పోషించారు. హకీమ్ సేవలను గుర్తించిన ప్రభుత్వం ధ్యాన్‌చంద్ అవార్డు, ద్రోణాచార్య అవార్డులతో గౌరవించింది. హకీమ్ మృతి పట్ల ఏఐఎఫ్ఎఫ్ (ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ సంతాపం వ్యక్తం చేశారు. దేశంలో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరగడంలో హకీమ్ కృషి మరువలేనిది అని ఆయన పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications