న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

FIFA World Cup 2022‌లో మరో సంచలనం.. పోర్చుగల్‌ను ఓడించి నాకౌట్ చేరిన కొరియా

FIFA World Cup 2022: South Korea win Against Portugal To Reach World Cup Last 16

అల్‌ రయాన్‌: ఫిఫా ప్రపంచకప్ 2022లో మరో సంచలనం నమోదైంది. నాకౌట్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణ కొరియా అదరగొట్టింది. తమకంటే బలమైన పోర్చుగల్‌ను దక్షిణ కొరియా మట్టికరిపించింది. ఈ విజయంతో ఉరుగ్వే జట్టును వెనక్కునెట్టి నాకౌట్ చేరింది. గ్రూప్‌-హెచ్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కొరియా 2-1 పోర్చుగల్‌పై అనూహ్య విజయం సాధించింది. ఆట చివరి నిమిషాల్లో అదృష్టం కలిసిరావడంతో.. వాంగ్‌ హి చాన్‌ సూపర్‌ గోల్‌తో దక్షిణ కొరియా రౌండ్‌-16కు దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌లో బంతిపై నియంత్రణలో పోర్చుగల్‌ (62 శాతం)దే పైచేయి కానీ.. కీలక సమయాల్లో స్కోరు చేసిన కొరియాను విజయం వరించింది. ఫస్టాఫ్‌లో పోర్చుగల్‌ ఆటగాడు రికార్డో హోర్టా (5వ నిమిషం) గోల్‌ చేయగా.. 27వ నిమిషంలో కిమ్‌ యంగ్‌ జివోన్‌ దానిని సమం చేశాడు.

FIFA World Cup 2022: South Korea win Against Portugal To Reach World Cup Last 16

స్టాపేజ్‌ టైమ్‌ (90+1)లో పాస్‌ను అందుకొన్న సన్‌ హువాంగ్‌ మిన్‌ మెరుపు వేగంతో పోర్చుగల్‌ గోల్‌వైపు కదిలాడు. డిఫెండర్లు అడ్డుతగిలినా బంతిని తన ఆధీనంలో ఉంచుకొన్న సన్‌.. పెనాల్టీ ఏరియాలోకి చొచ్చుకొచ్చిన చాంగ్‌కు పాస్‌ చేయడం.. అతడు కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ బంతి నేరుగా నెట్‌లోకి పంపాడు. ఇక ఇంటికే అనుకున్న కొరియాను తర్వాతి రౌండ్‌కు చేర్చి హీరో అయ్యాడు.

FIFA World Cup 2022: South Korea win Against Portugal To Reach World Cup Last 16

కాగా, మ్యాచ్‌ ఆరంభమైన 5వ నిమిషంలోనే డలాట్‌ కొట్టిన క్రాస్‌ను హోర్టా నేరుగా గోల్‌లోకి పంపి పోర్చుగల్‌ను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. అయితే, 27వ నిమిషంలో కార్నర్‌ కిక్‌ను పోర్చుగల్‌ క్లియర్‌ చేయలేక పోవడంతో.. అక్కడే పొంచి ఉన్న కిమ్‌ యంగ్‌ పవర్‌ఫుల్‌ షాట్‌తో గోల్‌లోకి పంపి స్కోరు సమం చేశాడు. సెకండాఫ్‌లో ఇరుజట్లూ గోల్‌ ప్రయత్నాలు చేసినా సఫలం కాలేక పోయాయి.

FIFA World Cup 2022: South Korea win Against Portugal To Reach World Cup Last 16

కానీ, స్టాపేజ్‌ టైమ్‌లో చాన్‌ మెరుపు గోల్‌తో కొరియా ఆశలకు ఊపిరిలూదాడు. పోర్చుగల్‌ ముందుగానే ప్రీకార్టర్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకోవడంతో.. ఈ మ్యాచ్‌లో ఓడినా ఆ జట్టుపై ఎటువంటి ప్రభావం చూపలేదు. కొరియా నాకౌట్‌కు చేరడం ఇది మూడోసారి. 2002లో సెమీస్‌ చేరిన కొరియా.. 2010లో రౌండ్‌-16కు అర్హత సాధించింది.

Story first published: Saturday, December 3, 2022, 8:18 [IST]
Other articles published on Dec 3, 2022
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X