న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

FIFA World Cup 2022: చెత్తగాళ్ల చెంప చెళ్లుమనిపించిన జపాన్ ఫ్యాన్స్! (వీడియో)

FIFA World Cup 2022: Japan Fans Impress By Cleaning Up Qatar Stadium After Opening Match against Ecuador

దోహా: ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ 2022 టోర్నీలో జపాన్ ఫ్యాన్స్ తమ పనితో అందర్నీ ఆకట్టుకున్నారు. చెత్తగాళ్ల చెంప చెళ్లుమనిపించారు. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమిచ్చే జపానీయులు.. ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా ఖతార్-ఈక్వెడార్ మ్యాచ్ జరిగిన అనంతరం చిందర వందరగా చెత్తతో నిండిన స్టేడియాన్ని చూసి తట్టుకోలేకపోయారు. తమ పని కాకపోయినా.. చెత్తను ఏరి శుభ్రం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు సదరు జపానీయులకు సలాం చెబతున్నారు.

ఫిఫా ప్రారంభమైన నవంబర్ 20న ప్రారంభోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత ఖతర్ - ఈక్వెడార్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు హాజరైన ఖతార్, ఈక్వెడార్ అభిమానులు.. రచ్చ రచ్చ చేశారు. కామన్ సెన్స్ లేకుండా తమ వెంట తెచ్చుకున్న తినుబండారాలు.. కూలి డ్రింక్స్, వాటర్ బాటిళ్లు చెత్త డబ్బాల్లో వేయకుండా అక్కడే పడేసారు. దాంతో ఆటముగిశాక జపాన్‌కు చెందిన ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కొంతమంది స్టేడియం చుట్టూ కలియతిరుగుతూ ఇతర దేశాల ఫ్యాన్స్ పడేసిన చెత్తనంతా సంచుల్లోకి ఎత్తుతూ కనిపించారు.

FIFA World Cup 2022: Japan Fans Impress By Cleaning Up Qatar Stadium After Opening Match against Ecuador

ఖతర్‌కు చెందిన ఓ యూట్యూబర్ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో జపనీయులు స్టేడియంలో చెత్త ఉన్న చోటకు వెళ్లి దానిని సంచుల్లో ఎత్తుతూ కనిపించారు. తమ దేశం మ్యాచ్ కాకపోయినా ఆట చూడటానికి వచ్చిన జపనీయులు తమ చుట్టూ పరిసర ప్రాంతాలు శుభ్రం చేశారు. జపాన్ ప్రజలు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమిస్తారనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ రోడ్డు మీద వెళ్తూ చాక్లెట్ తింటే ఆ ప్యాక్ ను జేబులోనే పెట్టుకుని రోడ్డు మీద ఉన్న చెత్త డబ్బాల్లో పడేస్తారు. మనదేశంలో ఎలా చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందుకే జపాన్‌లో వీధులు పరిశుభ్రంగా కనిపిస్తాయి. ఇదే సూత్రాన్ని జపాన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఖతర్ స్టేడియంలో కూడా పాటించారు.

చెత్తనంతా ఎందుకు ఎత్తుతున్నారని సదరు యూట్యూబర్ జపనీయులను ప్రశ్నించగా.. 'మా పరిసరాలను మేం శుభ్రంగా ఉంచుకుంటాం. మా చుట్టూ చెత్త కనబడితే మేం దానిని తీసేస్తాం. మా ప్రదేశాలను మేం గౌరవిస్తాం..' అని తెలిపాడు. ఖతర్ -ఈక్వెడార్ మ్యాచ్ చూడటానికి వచ్చిన చాలామంది తమ జాతీయ జెండాలను ప్రదర్శించి తర్వాత వాటిని అక్కడే పడేసి వెళ్లారు. వాటిని తీసుకున్న జపాన్ ఫ్యాన్స్.. జాతీయ జెండాలను గౌరవించాలి గానీ ఇలా ఎక్కడబడితే అక్కడ పడేయడం భావ్యం కాదని తెలిపారు. జపాన్ ఫ్యాన్స్ ఇలా స్టేడియాలను శుభ్రం చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇలానే మ్యాచ్‌లకు హాజరైన ఫ్యాన్స్.. చెత్తను క్లీన్ చేస్తూ.. అందరికి స్పూర్దిదాయకంగా నిలిచారు.

Story first published: Wednesday, November 23, 2022, 16:07 [IST]
Other articles published on Nov 23, 2022
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X