న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

FIFA World Cup 2022‌లో మెరిసిన బ్యూటీ.. పిచ్చెక్కిచ్చే అందానికి అభిమానులు ఫిదా! ఫొటోలు వైరల్!

FIFA World Cup 2022 hottest fan Ivana Knoll photos goes viral

దోహా: ఫిఫా ప్రపంచకప్ 2022 తుది దశకు చేరింది. ప్రిక్వార్టర్స్ దశ ముగిసి క్వార్టర్ ఫైనల్ సమరానికి సిద్దమైంది. బ్రెజిల్, క్రొయేషియా మధ్య నేడు జరిగే మ్యాచ్‌తో క్వార్టర్ ఫైనల్ దశ‌కు తెరలేవనుంది. అయితే ఈ మెగా టోర్నీకి ముస్లిం దేశం అయిన ఖతార్ ఆతిథ్యం ఇవ్వడంతో అభిమానులు కఠిన ఆంక్షల మధ్య మ్యాచ్‌లు చూడాల్సి వచ్చింది. దాంతో అభిమానులు అందాల విందులు మిస్సయ్యాయి. ప్రతీ ఫిఫా ప్రపంచకప్ మాదిరి ఈ టోర్నీలో అంద చందాలతో కూడిన అదనపు ఆకర్షణలు కనిపించలేదు. కనీసం బీర్ తాగేందుకు కూడా అనుమతివ్వకపోవడంతో చాలా మంది ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు.

 పిచ్చెక్కిచ్చే అందంతో..

పిచ్చెక్కిచ్చే అందంతో..

అయితే టోర్నీ జరగుతున్నా కొద్ది ఖతార్ ప్రభుత్వం ఆంక్షల విషయంలో కాస్త సడలింపులు ఇచ్చింది. దాంతో మ్యాచ్‌లు చూసే అభిమానుల సంఖ్య కూడా పెరిగింది. అందచందాలకు దూరమై కరువులో ఉన్న ఫ్యాన్స్‌కు ఓ తార తళక్కుమన్నది. పిచ్చిక్కిచ్చే అందంతో అభిమానులను ఆకట్టుకుంది. ఎద అందాలన్నీ కనబడే డ్రెస్స్‌లో మ్యాచ్‌కు హాజరై.. క్రమశిక్షణకు మారుపేరు అయిన ఖతర్ అభిమానులను కవ్వించింది. తన అందంతో యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమె ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఖతార్ ఫ్యాన్స్ సైతం..

ఖతార్ ఫ్యాన్స్ సైతం..

ఆమె ఎవరో కాదు క్రొయోషియా బ్యూటీ ఇవానా నోల్. క్రొయేషియా-మెక్సికో మధ్య జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌కు ఈ బ్యూటీ హాజరైంది. మిస్ క్రొయేషియా అయిన ఇవానా నోల్.. ఖాతర్ చట్టాలను లెక్కచేయకుండా తన అందాలను ప్రదర్శించింది. దాంతో ఆమె ఫిఫా వరల్డ్ కప్ 2022 సెక్సిస్ట్ ఫ్యాన్‌గా అభిమానుల మనసులను దోచేసింది. ఆమె అందాలను చూసి స్టాండ్స్‌లో ఉన్న ప్రతీ ఒక్కరు తల తిప్పుకోలేకపోయారు. ఇవానా నోల్ స్టాండ్స్‌లో నడుస్తూ ఉండగా ఖతార్ ఫ్యాన్స్ ఆమెను ఫొటోలు తీసారు. ఈ ఫొటోను షేర్ చేసిన ఈ క్రొయేషియా బ్యూటీ.. 'థ్యాంక్యూ యువర్ సపోర్ట్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

జర్మనీలో పుట్టిన బ్యూటీ..

జర్మనీలో పుట్టిన బ్యూటీ..

అయితే ఆమె అందానికి ఫిదా అయ్యి ఖాతర్ అభిమానులు ఫొటోలు తీయలేదని, ఖతార్ చట్టాలను ఉల్లంఘించినందుకు ఆమెపై ఫిర్యాదు చేసేందుకు ఫొటోలు తీసారని ఆ దేశ వ్యాపారి ఒకరు ట్వీట్ చేశారు. ఖతార్‌లో ఒళ్లు కనబడేలా డ్రెస్స్‌లు ధరించడం నేరం. ముఖ్యంగా మహిళలు సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి. జర్మనీలో జన్మించిన ఇవానా నోల్.. ఏడేళ్ల వయసులోనే తల్లిదండ్రులతో క్రొయేషియాకు వలస వెళ్లింది. ఆమెకు 1 మిలియన్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు. 2018 ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌కు హాజరైనప్పుడే ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది.

నాకు అలాంటి డ్రెస్స్‌లే లేవు..

నాకు అలాంటి డ్రెస్స్‌లే లేవు..

మహిళల దుస్తుల విషయంలో ఖతార్‌ విధించిన నిబంధనలపై ఇవానా నోల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒళ్లు కప్పుకునే దుస్తులు తనకు లేవని పేర్కొంది. 'ఖతార్‌లో ప్రపంచకప్ అనగానే అభిమానులకు ఎలాంటి నిబంధనలు లేకుండా అనుమతిస్తారని భావించా. కానీ రూల్స్ ఉన్నాయని తెలిసి షాకయ్యా. ముఖ్యంగా మహిళలు చేతులు, భుజాలు, మొకాళ్లు, బెల్లీ కనబడకుండా డ్రెస్ కోడ్ పాటించాలనే నిబంధన నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒళ్లు మొత్తం కప్పుకునే డ్రెస్స్‌లు నా దగ్గర లేవు. నాకు పట్టరాని కోపం వచ్చింది.

నన్ను ఎవరూ అడ్డుకోలేదు..

నన్ను ఎవరూ అడ్డుకోలేదు..

నేను ముస్లిం కాకున్నా.. యూరప్ దేశస్తురాలిని అయినా.. వారి హిజామ్, నిఖబ్ అంటే గౌరవం ఉంది. వాళ్లు కూడా ఇతరుల ఆచారాలు, వ్యవహారాలను గౌరవించాలి. మా మతం ప్రకారం మేం మాకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చు. బికినీస్‌ కూడా ధరించవచ్చు. అయితే నేను ఖతార్‌కు వచ్చినప్పుడు నా దుస్తులపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో కాస్త ఆశ్చర్యానికి గురయ్యా. అయితే ప్రభుత్వ కార్యాలయాలు, పర్యాటక ప్రాంతాలకు తప్పా మిగతా ప్లేస్‌ల్లో స్వేచ్చగా తిరిగాను'అని ఇవానా నోల్ చెప్పుకొచ్చింది.

Story first published: Friday, December 9, 2022, 14:21 [IST]
Other articles published on Dec 9, 2022
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X