న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

FIFA WC 2022: శృతి మించిన అర్జెంటీనా సంబరాలు.. హెలికాప్టర్‌తో ఆటగాళ్ల తరలింపు!

 FIFA WC 2022: Lionel Messi And Argentina Players Evacuated By Helicopter After Crowds Swarm Team Bus

బ్యూనస్ ఎయిర్స్: 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఫిఫా ప్రపంచకప్‌ గెలిచి సొంతగడ్డపై అడుగుపెట్టిన అర్జెంటీనా జట్టుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. మంగళవారం తెల్లవారు జామున ఎజీజా ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఆటగాళ్లకు రెడ్ కార్పెట్ మీదు ముందుకు వెళ్లారు. తమ ఆటగాళ్లు వస్తున్నారన్న వార్త తెలిసి రోడ్ల మీదకు భారీగా తరలొచ్చిన ఫ్యాన్స్‌ వారి రాక కోసం గంటల తరబడి నిరీక్షించారు. ఒక్కసారైనా తమ హీరోలను చూడాలని తపించారు. అర్జెంటీనా రాజధాని బ్యూనర్‌ ఎయిర్స్‌కు పక్కన ఉండే ఇజీజా విమానాశ్రయంలో కెప్టెన్‌ మెస్సి, అతడి సహచరులు విమానం దిగగానే ఎర్ర తివాచితో ఘన స్వాగతం చెప్పారు.

విమానం నుంచి మొదట మెస్సి ఆ తర్వాత కోచ్‌ స్కాలోని, ఆటగాళ్లు బయటకు వచ్చారు. వారి రాకతో నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. ఒకవైపు తమ జట్టును కీర్తిస్తూ రాక్‌బ్యాండ్‌ పాటలు, మరోవైపు 'థాంక్యూ ఛాంపియన్స్‌' అనే ప్లకార్డులతో విమానాశ్రయంలో ఎటు చూసినా అర్జెంటీనా జపమే. ఆ తర్వాత అభిమానులు అడుగడుగునా నీరాజనాలు పడుతుండగా ఓపెన్‌ టాప్‌ బస్సులో మెస్సి బృందం కూడా రాక్‌బ్యాండ్‌తో శ్రుతి కలిపి తమ దేశ ఫుట్‌బాల్‌ సంఘం ప్రధాన కేంద్రానికి వెళ్లింది. అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్‌ మంగళవారం జాతీయ సెలవుగా ప్రకటించడంతో అభిమానుల తాకిడి మరింత పెరిగింది. ఎటు చూసిన ఇసుక వేస్తే రాలనంత జనం రావడంతో పరిస్థితి అదుపు తప్పింది.


కొందరు అభిమానులు హద్దులు ధాటి మెస్సీ బృందం ప్రయాణిస్తున్న ఓపెన్ టాప్ బస్సులోకి దూకే ప్రయత్నం చేశారు. ఒకరు ఆటగాళ్ల మధ్యలోకి దూకినా.. మరొకరు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో ఆటగాళ్ల క్షేమం కోసం అర్జెంటీనా ప్రభుత్వం జైత్రయాత్రను రద్దు చేసి హెలీకాప్టర్ ద్వారా ఆటగాళ్లను అభిమానుల మధ్య నుంచి తీసుకెళ్లింది. ఆదివారం జరిగిన ఫైనల్లో అర్జెంటీనా 4-2(షూటౌట్)తో ఫ్రాన్స్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచి విషయం తెలిసిందే.

Story first published: Wednesday, December 21, 2022, 11:02 [IST]
Other articles published on Dec 21, 2022
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X