న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ముగిసిన మెస్సీ పోరాటం: ఫ్రాన్స్ చేతిలో అర్జెంటీనా ఓటమి

By Nageshwara Rao
World Cup 2018: France reach quarter-finals with 4-3 win over Argentina
FIFA WC 2018: Kylian Mbappe destroys Argentina to send Lionel Messi and co home in World Cup thriller

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్‌ మెస్సీ పోరాటం ముగిసింది. నాకౌట్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ అద్భుత ప్రదర్శన చేసింది. శనివారం ఫ్రాన్స్‌తో జరిగిన నాకౌట్‌ పోరులో అర్జెంటీనా 4-3 తేడాతో ఓటమి పాలైంది. తాజా విజయంతో ఫ్రాన్స్ క్వార్టర్స్‌కు అర్హత సాధించింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

గ్రూప్‌ స్టేజిలో వరుస విజయాలందుకున్న ఫ్రాన్స్‌ తన జైత్రయాత్రను కొనసాగించింది. అద్భుత ఫామ్‌లో ఉన్న కైలియన్ మొబప్పె వరుసగా రెండు అద్భుత గోల్స్‌ అందించి తమ జట్టుకు విజయాన్ని అందించాడు. తొలి అర్థబాగం వరకు ఇరు జట్లు సమానంగా పోరాడాయి. అర్జెంటీనా ఆటగాడు మార్కస్‌ రోజో 11వ నిమిషంలో చేసిన ఫౌల్‌తో ఫ్రాన్స్‌కు పెనాల్టీ లభించింది.

ఫ్రాన్స్‌కు తొలి గోల్‌ అందించిన గ్రీజ్‌మన్‌

ఫ్రాన్స్‌కు తొలి గోల్‌ అందించిన గ్రీజ్‌మన్‌

దానిని గ్రీజ్‌మన్‌ గోల్‌గా మలిచి ఫ్రాన్స్‌కు తొలి గోల్‌ అందించాడు. ఆ తర్వాత నుంచి గోల్‌ కోసం అర్జెంటీనా తీవ్రంగా పోరాడింది. ఈ క్రమంలో 41నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు మారియా తొలి గోల్‌ చేసి స్కోరు 1-1కి సమం చేశాడు. దీంతో ఆ తర్వాత మరో గోల్ నమోదు కాకపోవడంతో తొలి అర్ధభాగం 1-1తో సమంగా ముగిసింది.

48నిమిషంలో మరో గోల్‌

ఆ తర్వాత మొదలైన రెండో అర్ధభాగంలో అర్జెంటీనాకు 48నిమిషంలో మరో గోల్‌ కొట్టింది. మెస్సీ అందించిన పాస్‌ను మెర్కాడో నేరుగా గోల్‌గా మలిచి అర్జెంటీనా ఆధిక్యాన్ని 2-1కి పెంచాడు. అప్పటి నుంచి పుంజుకున్న ఫ్రాన్స్‌ ఎటాకింగ్‌ గేమ్‌ ఆడుతూ వచ్చింది. 57వ నిమిషంలో ఫ్రాన్స్‌ ఆటగాడు బెంజమిన్‌ పెవార్డ్‌ గోల్‌ అందించడంతో స్కోర్లు మరోసారి సమమయ్యాయి.

 రెండు వరుస గోల్‌లతో చెలరేగిపోయిన మొబప్పె

రెండు వరుస గోల్‌లతో చెలరేగిపోయిన మొబప్పె

ఈ తరుణంలో అనూహ్యంగా కైలియన్‌ మొబప్పె 64, 68వ నిమిషంలో రెచ్చిపోయి ఆడి రెండు వరుస గోల్‌లతో చెలరేగిపోయాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్‌ 4-2తో ఫ్రాన్స్‌ చేతుల్లోకి వెళ్లింది. తర్వాతి నుంచి అర్జెంటీనా ఎంత పోరాడినా ఇంజారీ టైమ్‌లో(90+3) మరో గోల్‌ మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో మెస్సీ ఒక్క గోల్‌ కూడా చేయకపోవడం అభిమానులకు నిరాశ కలిగించింది.

 నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఒక్క గోల్ నమోదు చేసిన మెస్సీ

నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఒక్క గోల్ నమోదు చేసిన మెస్సీ

తాను ఆడిన ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో(8 మ్యాచ్‌లు) ఇప్పటివరకు మెస్సీ ఒక్క గోల్‌ చేయకపోవడం గమనార్హం. ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో కేవలం ఐదోసారి మాత్రమే అర్జెంటీనా తన ప్రత్యర్థి జట్టుకు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ గోల్స్‌ సమర్పించుకుంది. 1986లో బెల్జియం (యూఎస్‌ఎస్‌ఆర్‌ చేతిలో 3-4తో ఓటమి) తర్వాత కనీసం మూడు గోల్స్‌ చేసి ప్రపంచకప్‌ మ్యాచ్‌లో పరాజయం పాలైన రెండో జట్టుగా అర్జెంటీనా నిలిచింది.

Story first published: Sunday, July 1, 2018, 10:04 [IST]
Other articles published on Jul 1, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X