Diego Maradona నాపై అత్యాచారం చేశాడు.. క్యూబా మహిళ సంచలన ఆరోపణలు!

బ్యూనస్‌ ఎయిర్స్‌ (అర్జెంటీనా): దివంగత ఫుట్‌బాల్‌ ప్లేయర్ డీగో మారడోనా.. తనపై అత్యాచారం చేశాడంటూ క్యూబాకు చెందిన ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. టీనేజ్‌లో ఉండగా తనపై అత్యాచారం చేయడమే కాకుండా చిత్రహింసలకు గురిచేశాడని క్యూబాకు చెందిన సదరు 37 ఏళ్ల మహిళ పేర్కొంది. 'మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, భౌతిక దాడులు వంటి నేరాలకు మారడోనా అనుచరులు పాల్పడ్డారని ఆమె ఇటీవల అమెరికన్‌ మీడియా వద్ద ప్రస్తావించారు.

కాగా, ఈ వ్యవహారంలో బాధిత మహిళ వారిపై ఫిర్యాదు చేయకపోయినా అర్జెంటీనాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ఆమె.. గతవారం కోర్టు విచారణకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది.

టీనేజ్‌లో ఉండగా..

టీనేజ్‌లో ఉండగా..

తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తాను టీనేజ్‌లో ఉండగా మారడోనాతో ఏం జరిగిందో చెప్పుకొచ్చింది. 'నేను టీనేజ్‌లో ఉండగా 2001లో మారడోనాను కలిశాను. అప్పుడు ఆయన డ్రగ్స్‌ వినియోగానికి సంబంధించిన చికిత్సలో భాగంగా క్యూబాకు వచ్చాడు. ఆ సమయంలో నాపై ఓ సందర్భంలో అత్యాచారం చేశాడు.

అప్పుడు మారడోనాతో నాలుగైదేళ్ల పాటు సన్నిహితంగా ఉన్నా. ఆ సమయంలో నన్ను చిత్ర హింసలకు గురిచేయడమే కాకుండా మాదక ద్రవ్యాలు తీసుకోవాలని బలవంతం చేశాడు. పలు సందర్భాల్లో భౌతిక దాడులు చేశాడు. దీంతో అమితంగా ఇష్టపడిన అతన్ని ఆ తర్వాత అసహ్యించుకున్నా' అని ఆమె తన బాధను పంచుకున్నారు.

తనలాంటి వారు..

తనలాంటి వారు..

ఇకపై ఈ విషయాల్లో తాను ఎలాంటి జోక్యం చేసుకోనని, తాను చెప్పాల్సింది మొత్తం కోర్టుకు తెలిపానని బాధిత మహిళ అన్నారు. ఇన్నేళ్ల తర్వాత ఈ విషయాలపై నోరు విప్పడం సంతోషంగా ఉందన్నారు. తనలాంటి పరిస్థితి మరెవరికీ ఎదురవ్వద్దని, అలాగే తనలా బాధపడిన యువతులు ఇకనైనా ధైర్యం చేసి ముందుకు వస్తారనే ఉద్దేశంతోనే తానీ విషయాలను వెల్లడించానని చెప్పుకొచ్చింది. కాగా, ఈ కేసు విచారణ ఎదుర్కొంటున్న మారడోనా అనుచరులు తాము ఎలాంటి నేరాలకు పాల్పడలేదని కోర్టుకు తెలపడం గమనార్హం.

గోల్డెన్ బాయ్..

గోల్డెన్ బాయ్..

ఫుట్‌బాల్‌ ప్రపంచంలో ఎన్నో అరుదైన, లెక్కలేనన్ని ఘనతలు సొంతం చేసుకున్న డీగో... నాలుగు ప్రపంచకప్‌లు ఆడి 1986లో తమ జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. 1990లో అతని సారథ్యంలోనే అర్జెంటీనా రన్నరప్‌గా నిలిచింది. చనిపోయే సమయానికి మారడోనా అర్జెంటీనా ప్రీమియర్‌ డివిజన్‌ క్లబ్‌ జిమ్నాసియా (సీజీఈ)కి కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. కెరీర్‌ చివర్లో వచ్చిన వివాదాలతో అప్పటి వరకు సాధించిన ఘనతలపై నీలి నీడలు కమ్ముకున్నా... మైదానంలో అతని మంత్రముగ్ధమైన ఆటను చూసినవారెవరూ మారడోనాను మరచిపోలేరు. ‘గోల్డెన్‌ బాయ్‌'గా మారడోనా సాధించిన ఖ్యాతి అజరామరం.

పేదకుటుంబంలో..

పేదకుటుంబంలో..

ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన దిగ్గజాల్లో మారడోనా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. సాకర్‌ ప్రపంచాన్ని శాసించిన మారడోనా అసలు పేరు ‘డీగో అర్మాండో మారడోనా'. 1960 అక్టోబరు 30న అర్జెంటీనా, బ్యూన్‌సఎయిర్స్‌లో పేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి డిగో మారడోనా, తల్లి డల్మా సాల్వర్డో ప్రాంకో. నలుగురు అమ్మాయిల తర్వాత మారడోనా జన్మించాడు. అతడిని ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. ఎనిమిదేళ్ల వయసులోనే ఆటలో అద్భుతాలు చేసేవాడు. 982లో మారడోనా తొలిసారి ప్రపంచ కప్‌ బరిలోకి దిగాడు. ఐదు మ్యాచ్‌లు ఆడినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ 1986 ప్రపంచకప్‌ అతడిని దిగ్గజంగా మార్చింది.

మెక్సికోలో జరిగిన ఈ టోర్నీలో కెప్టెన్‌గా, బెస్ట్‌ ప్లేయర్‌గా నిలిచి అర్జెంటీనాను చాంపియన్‌ను చేశాడు. 1990లో అర్జెంటీనా ఫైనల్‌కు చేరి జర్మనీ చేతిలో ఓడిన తర్వాత అతని ప్రభ తగ్గడం మొదలైంది. 1994 వరల్డ్‌ కప్‌లో కూడా ఆడినా... రెండు మ్యాచ్‌ల తర్వాతే డ్రగ్స్‌ ఆరోపణలతో టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS
Story first published: Tuesday, November 23, 2021, 16:56 [IST]
Other articles published on Nov 23, 2021
+ మరిన్ని
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X