న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

Lionel Messi: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. విజయానందం తట్టుకోలేక కన్నీళ్లు! (వైరల్ వీడియో)

Copa America 2021: Video of Neymar hugging Lionel Messi Post-match Goes Viral

రియో డిజనీరో: వరల్డ్ బెస్ట్ టీమ్.. అయితేనేం!. ప్రతిష్టాత్మకంగా భావించే ట్రోఫీని ఎత్తడానికి 28 ఏళ్లు నిరీక్షించింది. అతను ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ గ్రేట్ ప్లేయర్స్‌లో ఒకడు. అయినా ఇన్నాళ్లూ కెరీర్‌లో ఒక్క మేజర్ టైటిల్ కూడా తన నేషనల్ టీమ్‌కు అందించలేదనే లోటు. నాలుగు మేజర్ టోర్నీ ఫైనల్స్‌లో ఓడిపోయిన తర్వాత, ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించి మళ్లీ వచ్చిన ఇన్నాళ్లకు అతని కల నెరవేరింది. ఇన్నాళ్లూ ఓడిన ప్రతిసారీ ఆ బాధతో కంటతడి పెట్టిన అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ.. మొత్తానికి తొలిసారి ఆనందం పట్టలేక ఏడ్చేశాడు.

నెయ్‌మర్‌ను హత్తుకొని..

తన టీమ్‌కు 28 ఏళ్ల తర్వాత కోపా అమెరికా ట్రోఫీ సాధించి పెట్టి సగర్వంగా కాలరెగరేశాడు. శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో బ్రెజిల్‌పై 1-0తో గెలిచిన అర్జెంటీనా 28 ఏళ్ల కరువు తీర్చుకుంది. అంతేకాదు 2500 రోజుల తర్వాత సొంతగడ్డపై బ్రెజిల్‌కు ఓటమి రుచేంటో చూపించింది. ఈ విజయానంతరం ప్రత్యర్థి ప్లేయర్ నెయ్‌మర్‌ను హత్తుకొని మెస్సీ భావోద్వేగానికి గురవ్వడం అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట వైరల్ అవుతోంది.

గాయంతోనే బరిలోకి..

గాయంతోనే బరిలోకి..

ఫైనల్లో డీ మారియా చేసిన ఏకైక గోల్‌తో అర్జెంటీనా ట్రోఫీ గెలిచింది కానీ.. టోర్నీ మొత్తం ఆ టీమ్ తరఫున కెప్టెన్ మెస్సీయే అద్భుతంగా రాణించాడు. మొత్తం 4 గోల్స్ చేయడంతోపాటు 5 గోల్స్ కావడంలో సాయం చేసి టోర్నీ టాప్ స్కోరర్‌, బెస్ట్ ప్లేయర్ ట్రోఫీలు అందుకున్నాడు. మెస్సీకిది అర్జెంటీనా తరఫున 151వ మ్యాచ్‌. ఆ టీమ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు కూడా మెస్సీదే. ఇన్ని మ్యాచ్‌లు ఆడిన తర్వాత కోపా ఫైనల్లో రిఫరీ చివరి విజిల్ వేయగానే మెస్సీ గ్రౌండ్‌లోనే మోకాళ్లపై కూర్చొని కన్నీళ్లు పెట్టాడు. తన కెరీర్‌లో అర్జెంటీనా తరఫున గెలిచిన తొలి మేజర్ టోర్నీ ఇదే. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో అతను గాయంతోనే బరిలోకి దిగాడు.

వరల్డ్‌కప్ గెలవడం లక్ష్యం

వరల్డ్‌కప్ గెలవడం లక్ష్యం

2014 వరల్డ్‌కప్‌లో ఫైనల్ చేరిన అర్జెంటీనా.. జర్మనీ చేతిలో 0-1తో ఓడింది. తన టీమ్‌ను విశ్వవిజేతగా నిలపడానికి మెస్సీ అతి దగ్గరగా వచ్చిన సందర్భమదే. ఇక ఇప్పుడు వచ్చే ఏడాది ఖతార్‌లో జరగబోయే వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాకు ట్రోఫీ సాధించి పెట్టడమే మెస్సీ లక్ష్యంగా పెట్టుకున్నాడు. కోపా అమెరికా ట్రోఫీ కంటే ముందు 2005లో అర్జెంటీనా తరఫున అండర్‌-20 వరల్డ్‌కప్ గెలవడం, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్స్ గెలవడమే మెస్సీ సాధించిన అతిపెద్ద విజయాలు.

కోహ్లీ తరహాలోనే వరుస ఓటములు..

కోహ్లీ తరహాలోనే వరుస ఓటములు..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తరహాలోనే మెస్సీ కీలక టోర్నీల్లో పరాభావాలు ఎదుర్కొన్నాడు. 2006 వరల్డ్‌కప్ క్వార్టర్‌ఫైనల్లో జర్మనీ చేతిలో, ఆ తర్వాతి ఏడాదే కోపా అమెరికా ఫైనల్లో బ్రెజిల్ చేతిలో మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా ఓటమిపాలైంది. 2014 వరల్డ్‌కప్‌లో తన టీమ్‌ను ఫైనల్ వరకూ తీసుకొచ్చినా.. జర్మనీ చేతుల్లో ఓటమి తప్పలేదు. ఇక 2015, 2016 కోపా అమెరికా ఫైనల్స్‌లో చిలీ చేతిలో అర్జెంటీనా ఓడింది. 2016లో కోపా ఫైనల్లో ఓడిన తర్వాతే మెస్సీ ఇక రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. అయితే 2018 వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ టైమ్‌లో రిటైర్మెంట్‌ నుంచి వెనర్కు వచ్చి అర్జెంటీనా తరఫున ఆడాడు. కానీ ఆ వరల్డ్‌కప్ ప్రిక్వార్టర్స్‌లోనే అర్జెంటీనా ఓడింది. తాజాగా బ్రెజిల్‌పై విజయం సాధించి కోపా అమెరికా టైటిల్ అందించాడు.

Story first published: Sunday, July 11, 2021, 19:35 [IST]
Other articles published on Jul 11, 2021
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X