న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫుట్‌బాల్‌ ఆటగాళ్లతో పిల్లల్ని కనండి: ప్రకటనపై బర్గర్‌ కింగ్‌ క్షమాపణ

By Nageshwara Rao
Burger King Apologizes for an Ad Offering Burgers to Russian Women Who Get Pregnant by World Cup Players

హైదరాబాద్: ప్రముఖ ఆహార సంస్ధ బర్గర్‌ కింగ్‌ రష్యా ప్రజల్ని క్షమాపణలు కోరింది. వరల్డ్ కప్‌ ఆడేందుకు రష్యాకు వచ్చే పుట్‌బాల్ ఆటగాళ్ల ద్వారా గర్భం దాల్చే రష్యా మహిళలకు జీవితాంతం వూపర్స్‌ (చాక్లెట్‌ బర్గర్‌లు) ఉచితంగా ఇస్తామని ప్రకటించింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

"ఉత్తమ ఫుట్‌బాల్‌ ఆటగాళ్ల ద్వారా పిల్లలకు జన్మనిచ్చి రష్యా ఫుట్‌బాల్‌ భవితవ్యాన్ని మెరుగ్గా తీర్చిదిద్దండి. అలాంటి మహిళలకు జీవితాంతం వూపర్స్‌ను ఉచితంగా అందిస్తాం'' అని బర్గర్‌ కింగ్‌ తన సోషల్ మీడియాలో రష్యన్ భాషలో ఓ ప్రకటనను పోస్టు చేసింది.

ఈ ప్రకటనపై తీవ్ర విమర్శలు చెలరేగడంతో ఆ పోస్టును తొలగించడంతో పాటు, ఇలాంటి ప్రకటన చేసినందుకు గాను క్షమాపణలు కోరింది. "మమ్మల్ని క్షమించండి. రష్యాలో ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ఈ ప్రకటన ఎంత మాత్రం ఆమోదం కానిది" అని పేర్కొంది.

కాగా, వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు రష్యా ఎంపీ అక్కడి మహిళలను విదేశీయులతో సెక్స్‌లో పాల్గొనవద్దంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌ చూసేందుకు వచ్చే అభిమానులతో సెక్స్‌లో పాల్గొంటే ఒంటరిగా పిల్లలను పెంచాల్సి వస్తుందని, అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని ఆమె చెప్పింది.

తమారా ప్లెత్నెవా అనే ఆ 70 ఏళ్ల ఎంపీ పార్లమెంట్‌ కుటుంబ కమిటీకి నాయకత్వం వహిస్తోంది. 'ప్రపంచకప్‌ సందర్భంగా రష్యా యువతులకు విదేశీయులతో పరిచయం ఏర్పడి, ఆ తర్వాత వారు తల్లులుగా మారొచ్చు. అలాంటి పరిస్థితి రాదని ఆశిస్తున్నా' అని ఆమె చెప్పింది.

'మనం మన పిల్లలకే జన్మనివ్వాలి' అంది. భిన్న వర్ణాలకు జన్మించిన పిల్లలు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి దగ్గరే పెరిగే అవకాశముందని ఆమె వ్యాఖ్యానించింది. ''అదృష్టంకొద్దీ ఆ పిల్లలు తల్లుల వర్ణంతో పుడితే ఫర్వాలేదు. మరో వర్ణంలో పుడితే మాత్రం ఇబ్బందే. వాళ్లు చాలా బాధపడాల్సివస్తుంది' అని చెప్పింది.

'ఆ పిల్లలను తల్లుల దగ్గరే వదిలేయొచ్చు లేదా తండ్రులు వారిని తమ వెంట తీసుకెళ్లొచ్చు. ఎలాగైనా వాళ్లు ఒంటరే అవుతారు' అని ఆమె అంది. రష్యా మహిళలు రష్యా పురుషులనే పెళ్లి చేసుకోవాలని ఆమె కోరిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, June 21, 2018, 17:37 [IST]
Other articles published on Jun 21, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X