న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

రేంజర్స్‌ ఎఫ్‌సీకి ప్రాతినిధ్యం.. తొలి మహిళా పుట్‌బాలర్‌గా బాలాదేవి ఘనత!!

Bala Devi 1st Indian woman to become a professional footballer after being signed by Rangers FC

బెంగళూరు: భారత మహిళా ఫుట్‌బాల్‌ కెప్టెన్, ఫార్వర్డ్ బాలాదేవీ అరుదైన ఘనత సంపాదించారు. విఖ్యాత స్కాట్లాండ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ రేంజర్స్‌ ఎఫ్‌సీకి ప్రాతినిధ్యం వహించే గొప్ప అవకాశాన్ని బాలాదేవీ దక్కించుకున్నారు. దీంతో విదేశీ క్లబ్ కాంట్రాక్టు సాధించిన భారత తొలి మహిళా సాకర్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించారు. బాలాదేవి తమ జట్టుతో 18 నెలలు పనిచేయనుందని రేంజర్స్ క్లబ్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ మ్యాచ్‌ ఎన్నో రోజులు గుర్తుంచుకోవచ్చు.. రోహిత్‌, షమీపై మాజీల ప్రశంసల జల్లు!!ఈ మ్యాచ్‌ ఎన్నో రోజులు గుర్తుంచుకోవచ్చు.. రోహిత్‌, షమీపై మాజీల ప్రశంసల జల్లు!!

గత నవంబర్ నెలలో జరిగిన సెలెకషన్ ట్రైల్స్ లో పాల్గొన్న మణిపూర్‌కు చెందిన 29 ఏళ్ల బాలాదేవి ఆటతీరుతో సంతృప్తి చెందిన రేంజర్స్ క్లబ్ 18 మాసాల కాంట్రాక్టు కుదుర్చుకొంది. దీంతో రేంజర్స్ తరఫున ఆడుతున్న మొట్టమొదటి ఆసియా అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా రికార్డుల్లోకి ఎక్కింది. 15 సంవత్సరాల వయసు నుండి సాకర్ ఆడుతూ వస్తున్న బాలాదేవి భారత సీనియర్ జట్టులో సభ్యురాలిగా ఇప్పటి వరకూ ఆడిన 58 మ్యాచ్‌లలో గోల్స్‌ను సాధించింది.

భారత దేశవాళీ సాకర్ టోర్నీల్లో 100కు పైగా గోల్స్‌తో తనకు తానేసాటిగా నిలిచింది. 2015, 2016 సీజన్లలో భారత అత్యుత్తమ మహిళా ఫుట్ బాలర్ అవార్డులను బాలాదేవి గెలుచుకుంది. ఓ విదేశీ సాకర్ క్లబ్‌కు ఎంపిక కావడంతో బాలాదేవి ఆనందం వ్యక్తం చేస్తోంది. 'ప్రపంచంలోని అతిపెద్ద క్లబ్‌లలో ఒకటైన రేంజర్స్‌కి ప్రాతినిధ్యం వహిస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఓ భారత మహిళగా నాకు ఎంతో గర్వకారణం. భారత మహిళలు సైతం ఫుట్‌బాల్‌ క్రీడలో విదేశీక్లబ్ జట్లకు ఆడగలరని ఆశిస్తున్నా' అని బాలాదేవి పేర్కొన్నారు.

'నన్ను నమ్మినందుకు అమీ మెక్‌డొనాల్డ్, కోచింగ్ సిబ్బంది మరియు రేంజర్స్‌లోని మొత్తం మేనేజ్‌మెంట్‌కు చాలా కృతజ్ఞతలు. అలాగే, బెంగళూరు ఎఫ్‌సీ లేకుండా నేను ఈ ఘనతను సాధించేదాన్ని కాదు' అని బాలాదేవి చెప్పారు. రేంజర్స్ ఎఫ్‌సీలో మహిళల మరియు బాలికల ఫుట్‌బాల్ మేనేజర్ మెక్‌డొనాల్డ్ మాట్లాడుతూ... 'బాలాను రేంజర్స్‌కు స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాం. బాలా ఒక ప్లేమేకర్, ఆమె 10వ స్థానంలో ఆడటానికి ఇష్టపడుతుంది. జట్టుకు సహాయం చేస్తుందని మేము నమ్ముతున్నాం' అని తెలిపారు.

Story first published: Thursday, January 30, 2020, 12:35 [IST]
Other articles published on Jan 30, 2020
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X