న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

అస్సాం వీధుల్లో పేపర్ ఉండలతో ఆడి.. ఇప్పుడు జాతీయ స్థాయికి

A street footballer - William Lalnunfela - turns Aizawl FC's new hero

హైదరాబాద్: ఇంఫాల్‌కు చెందిన చాలా చిన్న ప్రాంతంలో వీధుల్లో కాగితాలను ఉండలుగా చేసి రబ్బర్లతో కట్టి ఆడిన ఓ పిల్లాడు ఇప్పుడు జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా కి ఎదిగాడు. వినడానికి ఓ సినిమా కథలా ఉన్నా ఇది నిజం. మిజోరాం రాజధాని అయిన ఇంఫాల్ కు మూడున్నర గంటల ప్రయాణం దూరంలో ఉన్న కుగ్రామంలో పుట్టిందీ ఈ విజయ గాథ.

విలియం లాల్‌నన్ఫెలా తండ్రి ఓ సాధారణ దినసరి వేతనం చేసే డ్రైవర్. ముగ్గురు కొడుకులను పోషించడానికే నానాకష్టాలు పడే అతనికి కొడుకులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి ఇతరేతర విద్యలు నేర్పించే స్తోమత లేదు. అందుకే చిన్న పిల్లల బొమ్మలు సైతం కొనిచ్చే వాడు కాదు. అటువంటి స్థితిలో విలియం ఆడుకునేందుకు స్వతహాగా పేపర్ ఉండలు చుట్టుకుని వాటితోనే ఆడుకుని ఆనందపడేవాడు. అలా తన జీవితంలో సరదాగా ఆడుకునే ఆట తనను ఈ స్థాయికి నిలబెట్టింది.

'సరిగ్గా అప్పుడు సమయం ఎంతైందో తెలీదు. నేను ఆడుకుంటూండగా మా పక్కింటిలో 2002 ఫుట్ బాల్ మ్యాచ్ వస్తుంది. అప్పుడే రొనాల్డిన్హో కాలితో బంతిని తన్నే శైలిని చూశాను. చాలా బాగా నచ్చింది. తర్వాత నుంచి నేను కూడా అలానే చేయడం మొదలుపెట్టాను. అదే నన్నింతటి వాడిని చేసింది.' అని విలియం చెప్పుకొచ్చాడు. అలా వీధుల్లో ఆడుకుంటూ వీధి స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎదిగాడు.

2003 విలియం లాల్నన్ఫెలా జిల్లా స్థాయిలో ఆడి 30 గోల్ లు సాధించాడు. అంతేగాక డ్రిబ్లింగ్ మాస్టర్ అనే బిరుదును కూడా గెలిచాడు. 2011వ సంవత్సరంలో కోచ్ రంజన్ చౌదరి ఉన్న సమయంలో 2011లో పూణె ఎఫ్ సీ క్లబ్ లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఐజ్వాల్ ఎఫ్‌సీ క్లబ్‌లో ఆడుతున్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 8, 2017, 15:48 [IST]
Other articles published on Dec 8, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X