న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

టికెట్లన్నీ హాట్‌కేకుల్లా: సునీల్ ఛెత్రి ట్వీట్‌కు విశేష స్పందన

By Nageshwara Rao
A Day After Sunil Chhetris Humble Appeal to Football Fans, All Tickets at Mumbai Stadium Sold Out

హైదరాబాద్: భారత పుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి ఓ అద్భుతమే చేశాడు. కేవలం క్రికెట్‌ను మాత్రమే అమితంగా ప్రేమించే అభిమానులు ఇకపై, పుట్‌బాల్ వైపు కూడా మళ్లనున్నారు. ఈ క్రమంలో భారత పుట్‌బాల్ ఓ అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌‌లో భాగంగా సోమవారం కెన్యాతో సోమవారం భారత పుట్‌బాల్ జట్టు ఆడబోమే మ్యాచ్ టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

'తిట్టండి... విమర్శించండి.. కానీ మైదానాలకు వచ్చి భారత ఫుట్‌బాల్‌ జట్టు ఆట చూడండి' అంటూ భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఛెత్రి పిలుపునకు బాగానే స్పందన వచ్చింది. భారత్-కెన్యా జట్ల మధ్య జరిగే మ్యాచ్ చూసేందుకు పుట్‌బాల్ అభిమానులు గబడ్డారు. దీంతో టికెట్లన్నీ అమ్ముడైపోయాయి.

వివరాల్లోకి వెళితే.... అంతర్జాతీయ మ్యాచ్‌లో మూడోసారి హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన సునీల్ ఛెత్రీ.. ఆ సమయంలో స్టేడియమంతా ఖాళీగా ఉండటం చూసి తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. వెంటనే ట్విటర్ వేదికగా అభిమానులకు తన ఆవేదనను పంచుకున్న సంగతి తెలిసిందే. అతడి ఆవేదనకు పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఛెత్రీకి మద్దతుగా ట్వీట్లు చేశారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూడాల్సిందిగా పిలుపునిచ్చారు. ఇంటర్‌ కాంటినెంటల్ కప్‌లో భాగంగా సోమవారం రాత్రి ముంబైలో ఇండియా-కెన్యా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

ఇది సునీల్ ఛెత్రీకి 100వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. జూన్ 7వ తేదీన ఇదే వేదికలో న్యూజిలాండ్‌తో ఇండియా మరో మ్యాచ్ ఆడనుంది. సునీల్ ఛెత్రి ట్వీట్‌కు స్పందించిన క్రికెట్ లెజెండ్ సచిన్ మైదానాలకు వెళ్లి మ్యాచ్‌లను చూడాలని అభిమానులను కోరాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను సచిన్‌ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు.

Story first published: Monday, June 4, 2018, 15:09 [IST]
Other articles published on Jun 4, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X