ఫిపా వరల్డ్‌కప్ ఆశలు ఆవిరి: ఒమన్ చేతిలో భారత్ ఓటమి

హైదరాబాద్: భారత ఫుట్‌బాల్‌ జట్టు ఫిపా వరల్డ్‌కప్ ఆశలు గల్లంతయ్యాయి. 2022 ఫిపా వరల్డ్‌కప్ ఆసియా జోన్‌ క్వాలిఫయింగ్‌లో మూడో రౌండ్‌కు చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు ఓడిపోయింది. మంగళవారం ఇక్కడ జరిగిన గ్రూప్‌ 'ఇ' మ్యాచ్‌లో భారత్‌ 0-1తో ఒమన్ చేతిలో ఓడిపోయింది.

ఈ ఓటమితో రెండో రౌండ్‌ క్వాలిఫయింగ్‌ పోటీల్లో మరో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే భారత్‌ తన వరల్డ్‌కప్ ఆశలను ఆవిరి చేసుకుంది. సొంత ప్రేక్షకుల మధ్య ఆడిన ఒమన్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. మరోవైపు ఒమన్ దూకుడుకు కళ్లెం వేసేందుకే సునీల్ ఛెత్రీసేన శ్రమించింది.

డే నైట్ టెస్టులో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను ఎలా బోల్తా కొట్టిస్తానంటే!

ఏడో నిమిషంలో ఒమన్ ప్లేయర్ గసానీ బలమైన షాట్ బాదగా గోల్ పోస్ట్‌కు సమీపం నుంతి బంతి వెళ్లడంతో భారత్ ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత 33వ నిమిషంలో మోసిన్ అందించిన పాస్‌ను అద్భుతంగా సద్వినియోగం చేసుకున్న గసానీ బంతిని గోల్‌గా మలిచి తన జట్టుకు బ్రేక్‌ ఇచ్చాడు.

ఇక, రెండో అర్ధభాగంలో టీమిండియా దూకుడు ప్రదర్శించినా ఫలితం లేకపోయింది. భారత ఆటగాళ్లు పదే పదే ప్రత్యర్ధి గోల్ పోస్టుపై దాడులకు యత్నించినప్పటికీ ఒమన్ గోల్‌కీపర్ అలీ అల్ హబ్సీ సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత భారత్‌ చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో భారత ఓటమి ఖాయమైంది.

క్వాలిఫయర్స్ రెండో రౌండ్ పోటీల్లో ఐదు మ్యాచ్‌ల్లో రెండు పరాజయాలు, మూడు డ్రాలతో భారత్(3పాయింట్లు) గ్రూప్-ఇలో నాలుగో స్థానంలోనే ఉంది. ఒకవేళ భారత్‌ అర్హత పోటీల్లో ముందంజ వేయాలంటే మాత్రం మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో భారీ గోల్స్‌తో గెలవాలి. ఆ తర్వాత ఇతర గ్రూప్‌ల సమీకరణాలపై ఆధారపడాలి.

సచిన్ సరసన చేరేనా? అడిలైడ్ టెస్టులో నసీమ్ షా, అందరి చూపు అతడివైపే!

ఒమన్(12పాయింట్లు) తొమ్మిది పాయింట్ల ఆధిక్యంతో రెండో స్థానంలో ఉంది. రెండో రౌండ్‌లో నాలుగు అత్యుత్తమ జట్లు మూడో రౌండ్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. భారత్‌ మిగిలిన తమ మూడు మ్యాచ్‌లను వచ్చే ఏడాది మార్చి 26న ఖతార్‌తో, జూన్‌ 4న బంగ్లాదేశ్‌తో, జూన్‌ 9న అప్ఘన్‌తో తలపడనుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

మైఖేల్‌లో ఫాంటసీ పుట్‌బాల్ ఆడండి. బహుమతులు గెలవండి

Read more about: india ఇండియా
Story first published: Wednesday, November 20, 2019, 8:10 [IST]
Other articles published on Nov 20, 2019
+ మరిన్ని
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X