న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇటు భారత్ అయితే.. అటు సిరీస్‌ను సొంత చేసుకున్న పాక్‌

Zaman blasts Pakistan to Tri-Series final win over Oz

హైదరాబాద్: ముక్కోణపు టీ20 సిరీస్‌ను పాకిస్థాన్‌ సొంతం చేసుకుంది. ఆదివారం ఫైనల్లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. సిరీస్‌లో చివరిదైన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలవడంతో సిరీస్ సొంతమైంది.

ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ (46 బంతుల్లో 91; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెరీర్‌ బెస్ట్‌ ఇన్నింగ్స్‌తో పాక్‌ను గెలిపించాడు. మొదట ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేయగా... పాక్‌ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసి విజయం సాధించింది.

ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆసీస్‌ ఓపెనర్లు ఓపెనర్లు షార్ట్‌ (76; 53 బంతుల్లో 7ఫోర్లు. 4సిక్సలు), ఫించ్‌ (47) 27 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సులతో తొలి వికెట్‌కు 9.5 ఓవర్లలో 95 పరుగులు చేసి మెరుపు ఆరంభాన్నిచ్చినప్పటికీ.. తర్వాత ఆసీస్‌ ఇన్నింగ్స్‌ గాడి తప్పింది. ఫించ్‌ 27 బంతుల్లో(47) 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. అనంతరం పాక్‌ 2 పరుగులకే ఫర్హాన్‌ (0), హుస్సేన్‌ (0) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ స్థితిలో కెప్టెన్‌ సర్ఫరాజ్‌ (28; 4 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి 45 పరుగులు జతచేసిన ఫఖర్‌ ఆ తర్వాత షోయబ్‌ మాలిక్‌ (37 బంతుల్లో 43 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి 107 పరుగులు జతచేశాడు. అనంతరం ఫఖర్‌ అవుటైనా షోయబ్‌ మాలిక్‌ మిగతా పని పూర్తిచేశాడు.

ఆపై ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. మహ్మద్‌ ఆమిర్‌ (3/33), షాదాబ్‌ ఖాన్‌ (2/38) ఆసీస్‌ను కట్టడి చేశారు. అనంతరం ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ (91; 46 బంతుల్లో 12×4, 3×6) చెలరేగడంతో పాక్‌ సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది.

Story first published: Monday, July 9, 2018, 11:18 [IST]
Other articles published on Jul 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X