న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎవరి స్టయిల్ వారిదే: కోహ్లీ-రోహిత్ కెప్టెన్సీపై చాహల్

Yuzvendra Chahal eager to play under Rohit Sharma yet again

హైదరాబాద్: భారత్-శ్రీలంక టెస్ట్ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ విరామం కావాలని అడిగాడు. కోహ్లీ సెలవుపై వెళ్లడానికి ఒప్పుకున్న బీసీసీఐ కెప్టెన్ పొజిషన్‌లో రోహిత్ శర్మను ప్రకటించింది. రోహిత్ వన్డే, టీ-20 మ్యాచ్‌లకు గాను కెప్టెన్సీ వహించనున్నాడు. రోహిత్ కెప్టెన్సీలోని ఐపీఎల్ మ్యాచ్‌లోనే తన కెరీర్‌లోనే మొట్టమొదటిగా యజువేంద్ర చాహాల్ ఆరంభించాడు.

భారత్‌కు శ్రీలంకతో జరగనున్న వన్డే మ్యాచ్‌లో మార్పులు చేర్పులు కారణంగా మళ్లీ భారత్ తరపును చాహెల్ ఆడబోతున్నాడు. అతను ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్యనున్న సామీప్యతను మీడియాతో పంచుకున్నాడు.

'2013 ఐపీఎల్‌లో నా అరంగేట్రం ముంబయి ఇండియన్స్‌ తరఫున రోహిత్‌ శర్మ నాయకత్వంలో చేశాను. కోహ్లీలాగే రోహిత్‌ శర్మ కూడా దూకుడు స్వభావం కలిగిన ఆటగాడే. జట్టును ముందుండి నడిపిస్తాడు. అయినప్పటికీ వీరిద్దర్నీ పోల్చలేం. ఎవరి స్టైల్‌ వారిదే. ఇద్దరిలో నేను గమనించింది. విజయాల కోసం వీరు ఎప్పుడూ ఆకలిగానే ఉంటారు' అని చాహాల్ అన్నాడు.

'ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్‌ విజయవంతమయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ విజేతగా రోహిత్‌ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్‌ ట్రోఫీని దక్కించుకున్న సంగతి తెలిసిందే కదా. జట్టులో ఇంచుమించుగా ఒకే వయసు వాళ్లం ఉన్నాం. ప్రతి ప్లేయర్‌కు జట్టు విజయం కోసం ఏం చేయాలన్న దానిపై పూర్తి అవగాహన ఉంది' అని చాహల్‌ అన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 8, 2017, 17:12 [IST]
Other articles published on Dec 8, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X