యువీ దేవుడిచ్చిన వరం: ధోనిపై పాటిల్ మనసులో మాట

Posted By:

హైదరాబాద్: భారత క్రికెట్ జట్టులో యువరాజ్ సింగ్ లాంటి క్రికెటర్ ఉండటం దేవుడిచ్చిన వరమని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ సందీప్‌ పాటిల్‌ అన్నారు. 2019 వరల్డ్ కప్‌లో యువరాజ్ ఆడతాడా? లేడా అనే విషయం అతడి ఫామ్‌, ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని చెప్పారు.

శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్‌లలో యువరాజ్ సింగ్‌కు చోటు దక్కని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సందీప్‌ పాటిల్‌ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు యువీకి తానొక వీరాభిమానిగా ఉన్నానని, ఇకపై కూడా అతనికే వీరాభిమానిగా ఉండాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

వచ్చే వరల్డ్ కప్‌కు యువీ జట్టులో ఉంటారా?

వచ్చే వరల్డ్ కప్‌కు యువీ జట్టులో ఉంటారా?

వచ్చే వరల్డ్ కప్‌కు యువీ జట్టులో ఉంటారా? అన్న ప్రశ్నకు ‘వరల్డ్ కప్‌కు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఆ సమయానికి ఎవరు జట్టులో ఉంటారనేది వారి ఫిట్ నెస్‌పై ఆధారపడి ఉంటుంది. భారత క్రికెట్‌కు యువీ దేవుడిచ్చిన వరం. నేను అతడికి గొప్ప అభిమానిని. ఎప్పటికీ అతడి అభిమానినే' అని అన్నారు.

యువీ తిరిగి భారత జట్టులోకి వచ్చే సత్తా ఉంది

యువీ తిరిగి భారత జట్టులోకి వచ్చే సత్తా ఉంది

'అతనిప్పుడు పరుగులు చేసి ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంది. యువీ తిరిగి భారత జట్టులోకి వచ్చే సత్తా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. యువీ మళ్లీ జట్టులో చోటు సంపాదిస్తాడు. 2019కి చాలా సమయం ఉన్నందున యువరాజ్ చోటుపై స్పష్టత ఇవ్వలేను. అదే సమయంలో టీమిండియా సెలక్టర్‌గా తాను లేననే విషయం గుర్తు పెట్టుకోవాలి' అని అన్నారు.

యువ ఆటగాళ్లు తెరపైకి

యువ ఆటగాళ్లు తెరపైకి

ఇక ధోనీ, యువీ భవితవ్యం గురించి ఇప్పుడే చెప్పలేమని కూడా అన్నారు. ‘వారిద్దరూ ప్రత్యేక ఆటగాళ్లు. వారికున్న ప్రతిభలో నాకు కనీసం ఐదు శాతం ఉన్నా బాగుండేది' అని చెప్పారు. 2012 నుంచి 2016 వరకు చీఫ్‌ సెలక్టర్‌గా పనిచేసిన పాటిల్‌ భారత క్రికెట్‌లో పలువురు యువ ఆటగాళ్లను భర్తీ చేశారు

హార్దిక్‌ పాండ్యా ఎదుగుతున్న తీరు అద్భుతం

హార్దిక్‌ పాండ్యా ఎదుగుతున్న తీరు అద్భుతం

ఆనాడు తాను తీసుకున్న కఠిన నిర్ణయాలు నేడు సరైన ఫలితాలను ఇస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. యువ ఆల్ రౌండర్ హార్దిక్‌ పాండ్యా ఎదుగుతున్న తీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆస్ట్రేలియా సిరీస్‌కు జడేజా, అశ్విన్‌కు విశ్రాంతి కల్పించడం సరైన నిర్ణయమేనని చెప్పుకొచ్చారు.

Story first published: Sunday, September 17, 2017, 12:48 [IST]
Other articles published on Sep 17, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి