న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐదు నిమిషాలు ఆలస్యం కావడం వల్లే: ఉగ్రదాడిపై బంగ్లా వీడియో అనలిస్ట్‌

Your brain automatically freezes: Bangladesh team analyst on how they escaped New Zealand shooting

హైదరాబాద్: బంగ్లాదేశ్‌ జట్టు కెప్టెన్‌ మహ్మదుల్లా ప్రెస్‌మీట్‌ ఐదు నిమిషాలు ఆలస్యం కావడం వల్లే తాము బతికి పోయామని శ్రీనివాస్‌ చంద్రశేఖరన్‌ చెప్పాడు. న్యూజిలాండ్‌ సెంట్రల్ క్రైస్ట్‌ చర్చ్‌ నగరంలోని రెండు మసీదులపై ఉన్మాదులు శుక్రవారం విచక్షణారహితంగా కాల్పులు తెగబడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 49 మంది మృతి చెందగా... మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రార్థన సమయంలో దుండగులు కాల్పులకు తెగబడటంతో తీవ్ర ప్రాణనష్టం చోటుచేసుకుంది. ఈ ఉగ్రదాడితో న్యూజిలాండ్‌లో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు పర్యటన అర్ధంతరంగా ముగిసింది.

ఐపీఎల్ 2019: చెన్నై జట్టుకు యోయో టెస్టు లేదు, మరి ఫిట్‌నెస్!ఐపీఎల్ 2019: చెన్నై జట్టుకు యోయో టెస్టు లేదు, మరి ఫిట్‌నెస్!

క్షేమంగా బయటపడ్డ బంగ్లా టీమ్‌ వీడియో అనలిస్ట్‌

క్షేమంగా బయటపడ్డ బంగ్లా టీమ్‌ వీడియో అనలిస్ట్‌

ఈ ఉగ్రదాడి సమయంలో బస్సులోనే ఉన్న బంగ్లా టీమ్‌ వీడియో అనలిస్ట్‌, ముంబైకి చెందిన శ్రీనివాస్‌ చంద్రశేఖరన్‌ కూడా క్షేమంగా బయటపడ్డాడు. టీమ్‌ స్పిన్‌ కన్సల్టెంట్‌గా ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్‌ సునీల్‌ జోషి మాత్రం హోటల్‌లోనే ఉండిపోయాడు. ఈ ఉగ్రదాడి అనుభవాన్ని శ్రీనివాస్‌ చంద్రశేఖరన్‌ మీడియాతో పంచుకున్నాడు.

ఆటగాళ్లతో కలిసి గ్రౌండ్‌కు దగ్గరలోని

ఆటగాళ్లతో కలిసి గ్రౌండ్‌కు దగ్గరలోని

మీడియా సమావేశం ముగిసి న తర్వాత జట్టు సభ్యులు, సహాయ సిబ్బందిలో కొందరు ప్రార్థనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. "జట్టులోని కొందరు ఆటగాళ్లతో కలిసి గ్రౌండ్‌కు దగ్గరలోని మసీదుకు నేను కూడా బయల్దేరా. మహ్మదుల్లా ప్రెస్‌మీట్‌ ఆలస్యం కాకపోతే మరో 5 నిమిషాలు ముందే బయల్దేరేవాళ్లం" అని అన్నాడు.

మసీదులో ఉండేవాళ్లం

మసీదులో ఉండేవాళ్లం

"అలా వెళ్లి ఉంటే కాల్పుల సమయంలో మసీదులో ఉండేవాళ్లం. మేం బస్సులో అక్కడికి వెళ్లగా.. చూస్తుండగానే ఓ మహిళ నడుచుకుంటూ వచ్చి పడిపోయింది. కళ్లుతిరిగి అలా పడిపోయిందేమోనని అను కున్నాం. ఆ వెంటనే కాల్పుల శబ్దం మొదలైంది. దీంతో బస్సు లోనే ఉండిపోయాం. దాదాపు 10 నిమిషాలపాటు విచక్షణా రహితంగా కాల్పులు జరిగా యి" అని శ్రీనివాస్‌ చంద్రశేఖరన్‌ చెప్పాడు.

మేం నిజంగా చాలా అదృష్టవంతులం

మేం నిజంగా చాలా అదృష్టవంతులం

ఈ ఉగ్రదాడి నేపథ్యంలో కివీస్‌ టూర్‌ను బంగ్లాదేశ్‌ రద్దు చేసుకుంది. మూడు టెస్టుల సిరీ‌స్‌లో భాగంగా ఆఖరి, మూడో టెస్టు శనివారం నుంచి జరగాల్సి ఉంది. ఇక, బంగ్లా జట్టు మేనేజర్‌ ఖలీద్‌ మసూద్‌ మాట్లాడుతూ "మేం 3-4 నిమిషాల ముందు అక్కడికి చేరుకుని ఉంటే మసీదు లోపలే ఉండేవాళ్లం. కాల్పుల్లో భాగం కానందుకు మేం నిజంగా చాలా అదృష్టవంతులం" అని అన్నాడు.

సినిమా తరహా దృశ్యాలు కళ్లముందే కనిపించాయి

సినిమా తరహా దృశ్యాలు కళ్లముందే కనిపించాయి

"అయితే, సినిమా తరహా దృశ్యాలు కళ్లముందే కనిపించాయి. రక్తమోడుతున్న బాధితులు మసీదు నుంచి బయటికి రావడం వీక్షించాం. ఒక 8-10 నిమిషాల పాటు బస్సులోనే ఉండిపోయాం. కాల్పుల మోతతో దాదాపు పది నిమిషాలు బస్సులోనే కిందపడుకున్నాం. దుండగుల దృష్టి బస్సుపై పడితే ప్రమాదమని భావించి అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకున్నాం. వేగంగా నడుస్తూ హాగ్లీ ఓవల్‌ మైదానానికి చేరుకున్నాం" అని అన్నాడు.

Story first published: Saturday, March 16, 2019, 11:39 [IST]
Other articles published on Mar 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X