
మరో ఐదేళ్లలో ఆ స్థాయిలో ఉంటాడు:
ప్రస్తుత క్రికెట్‌లో విరాట్ కోహ్లీనే అత్యుత్తమమని, అయిదేళ్లలో బాబర్ అజామ్ రాణించే అవకాశం ఉందని యూనిస్ ఖాన్ పేర్కొన్నాడు. 'నాకు పోలికలు నచ్చవు. కోహ్లీ ఇప్పుడు అగ్రగామిగా కొనసాగుతున్నాడు. ఈరోజు అతడు టాప్ బ్యాట్స్‌మన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో రాణించాడు. బాబర్ కూడా ఇటీవల మూడు ఫార్మాట్లలో మంచి ప్రదర్శన చేశాడు. అయితే అతడిని నేను చూసే కోణం వేరు. ఇప్పుడు కోహ్లీ ఎక్కడైతే ఉన్నాడో, ఇప్పటివరకు కోహ్లీ ఏం సాధించాడో.. బాబర్ ఐదేళ్లలో ఆ స్థాయిలో ఉంటాడు' అని యూనిస్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

దిగ్గజ ఆటగాడిగా మారే అవకాశం ఉంది:
'కోహ్లీ, బాబర్ ఒకరితో మరొకరిని ఇప్పుడు పోల్చడం సరికాదు. మరో నాలుగైదేళ్ల తర్వాత పోల్చి చూస్తే బాగుంటుంది. 25 ఏళ్ల బాబర్ ఇప్పటికే తన వయసుకు మించి సాధించాడు. అయితే బాబర్‌పై భారీ అంచనాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అతడికి సమయం ఇస్తే.. సచిన్ టెండూల్కర్, జావెద్ మియాందాద్‌లా దిగ్గజ ఆటగాడిగా మారే అవకాశం ఉంది. బాబర్ మరిన్ని రికార్డులు బద్దలుకొడితే చూడాలని ఉంది, నా రికార్డులను కూడా అధిగమించాలి' అని పాక్ కోచ్ కోరుకున్నాడు. పాక్ తరుపున టెస్టుల్లో పదివేల పరుగులు పూర్తి చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా యూనిస్ నిలిచిని విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో పాక్ బ్యాటింగ్ కోచ్‌గా యూనిస్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నియమించింది.

16 సెంచరీలు:
2015లో పాకిస్థాన్ జట్టులోకి వచ్చిన బాబర్ అజామ్ ఇప్పటి వరకూ 26 టెస్టులాడి 45.12 సగటుతో 1,850 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 74 వన్డేల్లో 54.18 సగటుతో 3,359 పరుగులు చేసాడు. వన్డేల్లో 11 శతకాలు, 15 అర్ధ శతకాలు సాధించాడు. ఇక 38 టీ20లు ఆడి 50.72 సగటుతో 1,471 పరుగులు చేశాడు. ప్రస్తుతం బాబర్ అజామ్ వయసు 25 ఏళ్లు కాగా.. ఈ వయసులో కోహ్లీ గణాంకాలు ఇలా లేవు.

70 సెంచరీలు:
2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 86 టెస్టులాడి 53.63 సగటుతో 7,240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 248 వన్డేల్లో 59.34 సగటుతో 11,867 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 58 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 81 టీ20లలో 50.8 సగటుతో 2,794 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 21,901 పరుగులు చేశాడు.
గంగూలీ ఓ పిరికివాడు.. నా బౌలింగ్‌ను ఎదుర్కొవడానికి భయపడతాడు..: అక్తర్


Click it and Unblock the Notifications
