
నాకు నచ్చిన భారత కెప్టెన్ గంగూలీ:
తాజాగా హాలో యాప్‌లో అభిమానులతో చిట్‌చాట్ చేసిన అక్తర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. చిట్‌చాట్ సందర్భంగా అత్యుత్తమ భారత కెప్టెన్ ఎవరని ఓ అభిమాని అడగ్గా.. వెంటనే సౌరవ్ గంగూలీ పేరు చెప్పాడు. 'నాకు నచ్చిన భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ. టీమిండియా నుంచి అంతకంటే ఉత్తమ నాయకులు రాలేదు. కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ కూడా మంచి ప్రదర్శన చేశాడు. కానీ దాదా జట్టు స్వరూపాన్నే మార్చేశాడు. భారత్ జట్టుని క్లిష్టపరిస్థితుల్లో నడిపించిన ఘనత గంగూలీకే దక్కుతుంది' అని అక్తర్ వివరించాడు.

అత్యంత ధైర్యవంతుడైన బ్యాట్స్‌మన్ దాదా:
'1990ల్లో భారత్ మాపై పెద్దగా గెలవడం చూడలేదు. 2000లో గంగూలీ కెప్టెన్ అయ్యాక ఆ జట్టు పాక్‌ను ఓడిస్తుందని అనుకున్నా. అలాగే జరిగింది. దాదా గొప్ప మార్పు తెచ్చాడు. గంగూలీ ఓ పిరికివాడు, నా బౌలింగ్‌ను ఎదుర్కొవడానికి భయపడతాడని చాలా మంది భావించారు. కానీ నా కెరీర్‌లో నేను బౌలింగ్ చేసిన అత్యంత ధైర్యవంతుడైన బ్యాట్స్‌మన్ దాదానే. సౌరవ్ ఛాతీకి గురిపెట్టి నేను చాలా సార్లు బంతులేశా. అయినప్పటికీ ఓపెనర్‌గా దిగి.. ఓ యోధుడిలా నా బౌలింగ్‌ను ఎదుర్కొని పరుగులు సాధించాడు. బెంగాలీ ప్రజలు మంచి ప్రోత్సహాన్ని అందిస్తారు. నాయకులుగా ముందుండి నడిపిస్తారు. గంగూలీ కూడా అంతే' అని అక్తర్ తెలిపాడు.

కెప్టెన్‌గా ఎన్నో సాహసోపేత నిర్ణయాలు:
సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో 2004లో పాక్ పర్యటనకి వచ్చిన టీమిండియా.. అద్భుత ప్రదర్శనని కనబర్చించిందని రావల్పిండీ ఎక్స్‌ప్రెస్ గుర్తు చేసుకున్నాడు. ఆ టూర్‌లో పాక్‌ని టెస్టు సిరీస్‌లో 2-1తో.. ఐదు వన్డేల సిరీస్‌ని 3-2తో ఓడించి సిరీస్‌లు చేజిక్కించుకుంది. భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలాడిన గంగూలీ.. 38 సెంచరీలు చేశాడు. కెప్టెన్‌గా ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాడు. ముఖ్యంగా ధోనీ విషయంలో. ధోనీని మిడిలార్డర్ నుంచి మూడో స్థానానికి ప్రమోట్ చేయడం ద్వారా పవర్ హిట్టర్‌గా వెలుగులోకి వచ్చాడు. ఆపై ఏకంగా కెప్టెన్ అయ్యాడు.

గంటకి 161.3కిమీ వేగం:
2005 ఆస్ట్రేలియా పర్యటనలో తన సహచర ఆటగాడి కారణంగా తాను అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్నానని అక్తర్ తెలిపాడు. సదరు ఆటగాడి పేరును పాక్ టీమ్ మేనేజ్‌మెంట్ దాచిపెట్టడంతో తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ప్రతీ ఒక్కరు తనను అనుమానించారని ఈ రావల్పిండి ఎక్స్ ప్రెస్ గుర్తు చేసుకున్నాడు. ఆ క్రికెటర్ పేరు చెప్పకున్నా పర్లేదు కానీ.. దయచేసి అక్తర్‌కు సంబంధంలేదని చెప్పండని టీమ్ మేనేజ్‌మెంట్‌ను కోరానని చెప్పుకొచ్చాడు. అక్తర్ పాక్ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టీ20 ల్లో 19 వికెట్స్ పడగొట్టాడు. పాకిస్థాన్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 224 మ్యాచ్‌లు ఆడిన అక్తర్.. 444 వికెట్లతో ప్రపంచంలో అత్యంత భయంకరమైన బౌలర్లలో ఒకరిగా నిలిచాడు. 2003 వన్డే ప్రపంచకప్‌లో గంటకి 161.3కిమీ వేగంతో బంతిని విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.


Click it and Unblock the Notifications

ఈసారి టీమిండియాకు సవాలే: ద్రవిడ్










