న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓపెనర్‌గా సచిన్: ఇమ్రాన్‌ ఖాన్‌ కలల జట్టు ఇదే (వీడియో)

By Nageshwara Rao
Younis Khan picks Sachin Tendulkar in his all-time XI, Pakistan legend Imran Khan captain

హైదరాబాద్: పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్ యూనిస్‌ ఖాన్‌ తన కలల జట్టుని ప్రకటించాడు. లార్డ్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా యూనిస్‌ ఖాన్‌ ప్రకటించిన ఆల్ టైమ్ టెస్టు జట్టులో భారత్ తరుపున సచిన్ టెండూల్కర్ ఒక్కడే చోటు దక్కించుకున్నాడు.

2004లో బెంగళూరు వేదికగా భారత్‌తో జరిగిన టెస్టులో డబుల్ సెంచరీ చేసిన యూనిస్ ఖాన్ తన జట్టుకు కెప్టెన్‌గా పాకిస్థాన్‌ దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్‌ ఖాన్‌‌ను ఎంపిక చేశాడు. ఓపెనర్లుగా హనీఫ్‌ మహమ్మద్‌, సచిన్‌ టెండూల్కర్ పేర్లను సూచించాడు.

వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌గా దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ జాక్వస్ కల్లిస్, ఆ తర్వాతి స్థానాల్లో బ్రియన్‌ లారా, సర్‌ వివ్‌ రిచర్డ్స్‌, గ్యారీ సోబర్స్‌‌ను ఎంపిక చేశాడు. వికెట్‌ కీపర్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌కు చోటిచ్చాడు. బౌలర్లుగా సర్‌ రిచర్డ్‌ హడ్లే, గ్లేన్‌ మెక్‌గ్రాత్‌, ముత్తయ్య మురళీధరన్‌‌లను ఎంచుకున్నాడు.

తన ఆల్‌ టైమ్‌ టెస్టు జట్టుగా ఇదే అత్యంత బలమైన జట్టు అని యూనిస్‌ ఖాన్‌ పేర్కొన్నాడు. ఇక, యూనిస్‌ ఖాన్‌ విషయానికి వస్తే పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టుకు మూడు ఫార్మెట్‌లలో కెప్టెన్‌గా వ్యవహారించాడు. పాక్ తరుపున టెస్టుల్లో అత్యధిక పరుగులు, అధిక సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.

టెస్టు క్రికెట్‌లో పదివేల పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి పాకిస్థాన్‌ క్రికెటర్‌ చరిత్ర సృష్టించాడు. 2009లో పాకిస్థాన్‌ యూనిస్ ఖాన్ కెప్టెన్సీలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది.

Story first published: Friday, March 30, 2018, 20:28 [IST]
Other articles published on Mar 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X