న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గల్లీ క్రికెట్‌‌లో థర్డ్ అంపైర్‌గా ఐసీసీ !!

Youre out! ICC turns third umpire via Twitter in local village match

హైదరాబాద్: ఐసీసీ గల్లీ క్రికెట్‌ విషయంపై తీర్పు చెప్పింది. అవుటా.. కాదా అనే నిర్ణయంపై థర్డ్ అంపైర్‌గా వ్యవహరించింది. సాధారణంగా భారత్‌లో, పాకిస్థాన్‌లో క్రికెట్‌పై ఆసక్తి ఎక్కువ. ఈ నేపథ్యంలో ఖాళీ దొరికితే చాలు. బ్యాట్ పట్టుకుని సిద్ధమైపోతారు. ఇలా గల్లీ క్రికెట్ ఆడి అవుట్ అయిన ఓ క్రికెటర్‌పై సందేహం వ్యక్తం చేస్తూ అడిగిన ప్రశ్నకు ఐసీసీ బదులిచ్చింది.

తొలిసారి ఈ గల్లీ క్రికెట్ పంచాయతీలో మూడో అంపైర్‌గా వ్యవహరించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). పాకిస్థాన్‌లో జరిగిన ఈ గల్లీ మ్యాచ్‌లో ఓ బ్యాట్స్‌మన్ బలంగా కొట్టిన బంతి.. ఈదురు గాలుల కారణంగా తిరిగి వచ్చి వికెట్లను తాకింది. ఇది ఔటా.. కాదా.. అనే వివాదం తలెత్తింది. హమ్‌జా అనే ఓ వ్యక్తి సరదాగా ఈ వీడియోను ఐసీసీకి ట్వీట్ చేసి.. న్యాయం కావాలని అడిగాడు.

ఆశ్చర్యకరంగా ఐసీసీ కూడా ఈ ట్వీట్‌పై స్పందించింది. ఆ ప్రశ్నకు బదులుగా క్రికెట్ లా 32.1 ప్రకారం ఆ బ్యాట్స్‌మన్ ఔట్ అని తీర్పు చెప్పింది. ఈ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. బ్యాట్స్‌మన్ ఔటైన తీరు నవ్వు తెప్పించడంతోపాటు కొందరు నెటిజన్లు అతను ఔటైన విధానం చూసి సానుభూతి చూపిస్తున్నారు.

దాంతో పాటుగా ఇలా ఓ సాధారణ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులివ్వడంతో ఐసీసీపై పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇలా నియమాలతో కలిపి వివరణాత్మకంగా ఇచ్చిన సమధానంతో అవుట్ అయిన వ్యక్తికి ఓ అభిప్రాయం వచ్చుండాలి.

Story first published: Wednesday, May 23, 2018, 15:36 [IST]
Other articles published on May 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X