ఐపీఎల్ 2026 సీజన్‌కు రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఇప్పటికే 10 ఫ్రాంచైజీలు తమ సన్నాహకాలను పూర్తి చేసుకొని తమదైన వ్యూహాలతో టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. మరోవైపు మాజీ క్రికెటర్లు తమదైన వ్యాఖ్యలు, జోస్యాలు, అంచనాలతో ఈ క్యాష్ రిచ్ లీగ్‌పై హైప్ క్రియేట్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో విజేతగా నిలిచే జట్టు ఏది? ప్లే ఆఫ్స్ చేరే నాలుగు జట్లు ఏవి? అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జోరుగా కొనసాగుతోంది. తాజాగా ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఎక్స్‌పర్ట్స్.. ప్లే ఆఫ్స్ చేరే నాలుగు జట్ల వివరాలను వెల్లడించారు. 12 మంది ఎక్స్‌పర్ట్స్.. తమ అంచనాల్లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరుతుందని చెప్పడం గమనార్హం.
నలుగురు మాత్రమే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరుతుందని అంచనా వేసారు. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరుతుందని 8 మంది చెప్పగా.. ఐదుగురు మాత్రమే సీఎస్‌కే పేరు సూచించారు. మరో ఆరుగురు పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరుతుందని అంచనా వేసారు.

ఫాఫ్ డు ప్లెసిస్ - ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS), చెన్నై సూపర్ కింగ్స్ (CSK)/ఢిల్లీ క్యాపిటల్స్ (DC).
ఇర్ఫాన్ పఠాన్ - ముంబై ఇండియన్స్ (MI), ఢిల్లీ క్యాపిటల్స్ (DC), పంజాబ్ కింగ్స్ (PBKS), రాజస్థాన్ రాయల్స్ (RR).
హర్భజన్ సింగ్ - ముంబై ఇండియన్స్ (MI), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), పంజాబ్ కింగ్స్ (PBKS).
ఆకాష్ చోప్రా - ముంబై ఇండియన్స్ (MI), ఢిల్లీ క్యాపిటల్స్ (DC), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) & పంజాబ్ కింగ్స్ .
ఛతేశ్వర్ పుజారా - గుజరాత్ టైటాన్స్ (GT), చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ముంబై ఇండియన్స్ (MI).
మహ్మద్ కైఫ్ - పంజాబ్ కింగ్స్ (PBKS), ఢిల్లీ క్యాపిటల్స్ (DC), ముంబై ఇండియన్స్ (MI) & రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB).
హనుమ విహారి - సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), ఢిల్లీ క్యాపిటల్స్ (DC), పంజాబ్ కింగ్స్ (PBKS) & ముంబై ఇండియన్స్ (MI).
పియూష్ చావ్లా - ముంబై ఇండియన్స్ (MI), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS).
సబా కరీమ్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ముంబై ఇండియన్స్ (MI), ఢిల్లీ క్యాపిటల్స్ (DC), చెన్నై సూపర్ కింగ్స్ (CSK).
సంజయ్ బంగర్ - ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS), ఢిల్లీ క్యాపిటల్స్ (DC).
లక్ష్మీపతి బాలాజీ - చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH).
వరుణ్ ఆరోన్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK).