Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హే..రోహిత్.. నిన్ను నేను గుర్తుపట్టలేదబ్బా: నీతా అంబానీ (వీడియో)

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను చూసి ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ ఆశ్చర్యపోయింది. సన్నగా మారిన రోహిత్ శర్మను గుర్తుపట్టలేకపోయానని తెలిపింది. రోహిత్ కుర్రాడిలా మారిపోయాడని ప్రశంసించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027 గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్ శర్మ.. అందుకోసం ఫిట్‌నెస్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టాడు. కఠినమైన డైట్‌తో ఏకంగా 10 కిలోల బరువు తగ్గి సన్నగా మారిపోయాడు.

Nita Ambani Stunned by Rohit Sharma s Transformation Ahead of IPL 2026 Claims He Looks Like a Young Boy
Photo Credit: screen grab for MI X Video

ఐపీఎల్ 2026 సీజన్‌లో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ క్యాంప్‌లో ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. గురువారం సాయంత్ర ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ సెషన్‌ను నీతా అంబానీ సందర్శించింది. ఆటగాళ్లతో పాటు కోచ్‌లతో సరదాగా ముచ్చటించింది. ఈ క్రమంలో ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా మారిన రోహిత్ శర్మను చూసి అవాక్కైంది. 'హే రోహిత్.. నిన్ను అస్సలు గుర్తుపట్టలేదు. కుర్రాడిలా మారిపోయావ్'అని కితాబిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకోగా వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో హెడ్ కోచ్ మహేళ జయవర్దనేకు‌ షేక్ హ్యాండ్ ఇచ్చిన నీతా అంబానీ ఆ తర్వాత బౌలింగ్ కోచ్ కీరన్ పొలార్డ్‌ను కలిసింది. పొలి కాకకు హాయ్ చెప్పాలని తన గ్రాండ్ చిల్డ్రన్స్‌కు చెప్పింది. దాంతో అక్కడ నవ్వులు పూయగా.. తనను పొలి కాక అనడంతో పొలార్డ్ అవాక్కయ్యాడు. ఆ తర్వాత రోహిత్‌ను చూసిన నీతా అంబానీ.. 'మై గాడ్.. రోహిత్.. నిన్ను నేను గుర్తుపట్టలేదు. నువ్వు కుర్రాడిలా కనిపిస్తున్నావ్'అని అన్నది. ఆమె మాటలకు రోహిత్ నవ్వుతూ సంతోషం వ్యక్తం చేశాడు.

గత ఐదేళ్లుగా ఆరో టైటిల్ కోసం నిరీక్షిస్తున్న ముంబై ఇండియన్స్.. ఈ సారి సిక్స్ కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఆదివారం వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే తమ తొలి మ్యాచ్‌తో క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. పేపర్‌పై ముంబై ఇండియన్స్ చాలా భీకరంగా ఉంది.

Story first published: Friday, March 27, 2026, 12:13 [IST]
Other articles published on Mar 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+