IPL 2026: మామ నువ్వు RCB అభిమానివా? దమ్ముంటే ఈ టెస్ట్ పాసవ్వు!
ఐపీఎల్ 2026 సీజన్‌కు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) సిద్దమైంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో అసాధారణ ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచిన ఆర్‌సీబీ.. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. అదే జోరును ఈ సీజన్‌లోనూ కొనసాగించి టైటిల్‌ను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది.
రజత్ పటీదార్ సారథ్యంలో ఆర్‌సీబీ జట్టు బలంగా ఉంది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన మినీ వేలంలో 8 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన ఆర్‌సీబీ.. తమ కోర్ టీమ్‌ను పటిష్టంగా మార్చుకుంది. వెంకటేశ్ అయ్యర్‌ను రూ.7 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, రజత్ పటీదార్‌తో ఆర్‌సీబీ బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. కోహ్లీ, సాల్ట్ విధ్వంసకర బ్యాటింగ్‌తో అదిరిపోయే ఆరంభాన్ని అందించనుండగా.. పటీదార్, వెంకటేశ్ అయ్యర్, జితేష్ శర్మ, టీమ్ డేవిడ్ మిడిలార్డర్ బాధ్యతలతో పాటు ఫినిషర్లుగా సత్తా చాటనున్నారు.

జోష్ హజెల్ వుడ్, భువనేశ్వర్ కుమార్ వంటి అనుభవజ్ఞులతో పాటు సుయాష్ శర్మ, రొమారియో షెపర్డ్ (సీమ్) వంటి వైవిధ్యమైన బౌలర్లతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. అయితే ఆరంభ మ్యాచ్‌లకు హజెల్ వుడ్ దూరమవ్వడం, యష్ దయాల్ అందుబాటులో లేకపోవడం ఇబ్బంది పెట్టే విషయమే అయినా.. ఆర్‌సీబీకి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి.
అయితే ఆర్‌సీబీ ఫ్రాంచైజీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. 17 సీజన్లుగా ఆర్‌సీబీ ఒక్క టైటిల్ గెలవలేకపోయినా.. పేలవ ప్రదర్శన కనబర్చినా అభిమానుల సంఖ్య పెరిగిందే తప్పా తగ్గలేదు. ఆర్‌సీబీ కష్ట సుఖాల్లో అండగా నిలిచిన డై హార్డ్ ఫ్యాన్స్‌కు ఐపీఎల్ 2026 సందర్భంగా 'ఆర్‌సీబీ అల్టిమేట్ క్విజ్ పార్ట్ 1' అందుబాటులో ఉంది. పది ప్రశ్నలు, అత్యంత అవగాహన కలిగిన అభిమానిగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం. ఇంకెందుకు మొదలు పెట్టండి. ఆర్‌సీబీపై మీకున్న అభిమానాన్ని చాటుకోండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications