For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పిచ్‌పైకి వచ్చిన కుక్క.. ఢిల్లీ ప్లేయర్ ఏం చేశాడో చూశారా? (వీడియో)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఓ ఆసక్తికరమైన, మనసును హత్తుకునే సంఘటన చోటుచేసుకుంది. ఆ జట్టు యువ బ్యాటర్ అభిషేక్ పోరెల్ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అభిషేక్ పోరెల్ పెద్ద మనసు
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో బిజీగా ఉన్న సమయంలో ఓ కుక్క అకస్మాత్తుగా పిచ్‌పైకి వచ్చింది. సాధారణంగా మైదానంలోకి జంతువులు వస్తే సిబ్బంది వాటిని అదిలించి బయటకు పంపేస్తుంటారు. కానీ అక్కడ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న అభిషేక్ పోరెల్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ఆ కుక్కను కోపంతో పంపేయకుండా చాలా ప్రేమగా తన చేతుల్లోకి ఎత్తుకుని సురక్షితమైన ప్రదేశంలో వదిలిపెట్టాడు. అభిషేక్ పోరెల్ చూపిన ఈ మానవత్వానికి అక్కడున్న తోటి ప్లేయర్లతో పాటు కోచింగ్ స్టాఫ్ కూడా మురిసిపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ వీడియోను తమ సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకోగా.. అది కాసేపట్లోనే వైరల్‌గా మారింది.

Abhishek Porel Wins Hearts Rescues Dog During Delhi Capitals IPL 2026 Practice Video Viral

వేలంలో బలపడిన ఢిల్లీ సేన
తొలి ఐపీఎల్ టైటిల్ వేటలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ బలమైన జట్టును నిర్మించుకుంది. ముఖ్యంగా ఓపెనింగ్ స్థానం కోసం కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, పృథ్వీ షా, పాతుమ్ నిస్సంకా, బెన్ డకెట్ వంటి స్టార్ ఆటగాళ్లు పోటీపడుతున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో జరగనున్న మొదటి మ్యాచ్‌లో ఓపెనింగ్ జోడి ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బౌలింగ్ విభాగంలో మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, లుంగీ ఎంగిడి వంటి స్టార్ బౌలర్లు ఉండటం ఢిల్లీకి కలిసొచ్చే అంశం.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI(అంచనా):
కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అభిషేక్ పోరెల్, నితీష్ రాణా, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, ఆకిబ్ నబీ, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, లుంగీ ఎన్గిడి.

Story first published: Friday, March 27, 2026, 15:18 [IST]
Other articles published on Mar 27, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+