Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH Playing XI: నయా ఫినిషర్‌కు చోటు.. ఆర్‌సీబీతో తలపడే సన్‌రైజర్స్ తుది జట్టు ఇదే!

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) తొలి మ్యాచ్‌కు సిద్దమైంది. శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో ఆరెంజ్ ఆర్మీ అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే సన్నాహకాలను పూర్తి చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. గత సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబర్చి ఆరో స్థానంతో సరిపెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ సారి మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉంది.

బ్యాటింగ్‌లో ఆరెంజ్ ఆర్మీకి తిరుగు లేకున్నా.. బౌలింగ్‌ బలహీనంగా కనిపిస్తోంది. ప్యాట్ కమిన్స్, ఇషాన్ మలింగా గాయాలతో ఇబ్బంది పడుతుండటం సన్‌రైజర్స్ సమస్యలను రెట్టింపు చేసింది. కమిన్స్ గైర్హాజరీలో ఇషాన్ కిషన్ జట్టును నడిపించనున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయంతో పాటు టీ20 ప్రపంచకప్ గెలుపుతో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఇషాన్ బరిలోకి దిగుతున్నాడు. అభిషేక్, ట్రావిస్ హెడ్, క్లాసెన్ బ్యాట్ ఝులిపించడంతో పాటు బౌలింగ్ బలహీనతలను అధిగమిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తిరుగుండదు.

చిన్నస్వామిలో చితక్కొట్టుడే..

సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్‌కు పరుగుల వరద పారే చిన్నస్వామి స్టేడియం సరిగ్గా సరిపోతుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఫ్లాట్ వికెట్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు చెలరేగి 250 ప్లస్ స్కోర్ నమోదు చేస్తే ఈజీగా విజయం నమోదు చేయవచ్చు. అయితే కమిన్స్ గైర్హాజరీలో సన్‌రైజర్స్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. బ్యాటింగ్ లైనప్‌లో పెద్దగా మార్పులు లేకున్నా.. బౌలింగ్‌ సమస్యలను ఎలా అధిగమిస్తారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

SRH Playing XI vs RCB New Finisher Saleel Arora Set to Debut Over Aniket Varma in IPL 2026

నయా ఫినిషర్ సలీల్ అరోరాకు చోటు..

ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ బరిలోకి దిగనుండగా.. ఫస్ట్ డౌన్‌లో ఇషాన్ కిషన్ ఆడనున్నాడు. నాలుగో స్థానంలో డేంజరస్ హెన్రీచ్ క్లాసెన్ ఆడునుండగా.. ఐదో స్థానంలో సలీల్ అరోరా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. అతనికి తుది జట్టులో చోటు దక్కితే.. అరంగేట్ర మ్యాచ్ అవుతుంది. అనికేత్ వర్మతో అతనికి పోటీ నెలకొన్నా.. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో సలీల్ అరోరా అదరగొట్టాడు. రింకూ సింగ్ తరహాలో సిక్సర్లు బాదుతూ ఫినిషర్ పాత్ర పోషించేందుకు రెడీగా ఉన్నాడు. దాంతో అతనికే అవకాశం దక్కనుంది.

SRH Playing XI vs RCB New Finisher Saleel Arora Set to Debut Over Aniket Varma in IPL 2026

స్పిన్ బౌలింగ్ చేయడంతో పాటు విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగే లియామ్ లివింగ్ స్టోన్‌‌ ఆరో స్థానంలో ఆడుతాడు. నితీష్ కుమార్ రెడ్డి ఏడో స్థానంలో బరిలోకి దిగనుండగా.. హర్షల్ పటేల్ 8వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ ఆర్డర్‌లో స్వల్ప మార్పులు జరగవచ్చు. లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్ష్ దూబే స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా బరిలోకి దిగనున్నాడు. పవర్ ప్లేలో బౌలింగ్ చేసే సత్తా అతనికి ఉంది. కమిన్స్ స్థానాన్ని భర్తీ చేసే బాధ్యత బ్రైడన్ కార్స్‌కు దక్కనుండగా.. జయదేవ్ ఉనాద్కత్ పేస్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు. ఇషాన్ మలింగా మ్యాచ్ ఫిట్‌నెస్ సాధిస్తే బ్రైడెన్ కార్స్ బెంచ్‌కు పరిమితమవుతాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ప్రఫుల్ హింగే, శివమ్ మావి, శివాంగ్ కుమార్‌ల్లో ఒకరికి అవకాశం దక్కనుంది.

ఆర్‌సీబీతో మ్యాచ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా)

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(కెప్టెన్), హెన్రీచ్ క్లాసెన్, సలీల్ అరోరా/అనికేత్ వర్మ, లియామ్ లివింగ్ స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్, హర్ష్ దూబే, బ్రైడన్ కార్స్, జయదేవ్ ఉనాద్కత్

ఇంపాక్ట్ సబ్: శివమ్ మావి/ప్రఫుల్ హింగే/శివాంగ్ కుమార్

Take a Poll
Story first published: Friday, March 27, 2026, 19:21 [IST]
Other articles published on Mar 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+