Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026 ఛాంపియన్‌ ఎవరో తేల్చేసిన AI ప్లాట్ ఫామ్స్! అన్నింటా ఒకటే మాట!

ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్‌కు మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ టోర్నీ మొదలవ్వనుంది. ఇప్పటికే 10 జట్లు తమ సన్నాహకాలను పూర్తి చేసుకొని తమదైన వ్యూహాలతో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

డిఫెండింగ్ ఛాంపియర్ ఆర్‌సీబీ టైటిల్ నిలబెట్టుకుంటుందా? లేక గతేడాది తరహాలో ఈ సీజన్‌లో కూడా కొత్త ఛాంపియన్ అవతరిస్తుందా? ముంబై, సీఎస్‌కే ఆరో టైటిల్‌ను ముద్దాడుతాయా? కేకేఆర్ నాలుగో టైటిల్‌ను ఖాతాలో వేసుకుంటుందా? సన్‌రైజర్స్ రెండో టైటిల్ అందుకుంటుందా? అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జోరుగా సాగుతోంది.

కాగా.. ఏఐ ప్లాట్ ఫామ్స్ ఐపీఎల్ 2026 విజేత ఎవరో తేల్చి చెప్పాయి. అన్ని ప్లాట్ ఫామ్స్ దాదాపు ఒకే జట్టు పేరు చెబుతున్నాయి. ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచే అవకాశం ఉందని మెజార్టీ ఏఐ ప్లాట్ ఫామ్స్ తేల్చి చెప్పాయి. గూగుల్ జెమినీ, ఛాట్ జీపీటీ, గ్రోక్, మెటా ఏఐ ఇదే విషయాన్ని వెల్లడించాయి.

AI Predicts IPL 2026 Winner ChatGPT Gemini Grok and Meta AI Reveal Their Top Picks for the Trophy

అన్నింటా ఒకటే మాట

జెమినీ- ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లతో పటిష్టంగా ఉంది. ముంబై తర్వాత ఆర్‌సీబీ, సీఎస్‌కేకు అవకాశాలు ఉన్నాయి.

గ్రోక్- ముంబై ఇండియన్స్. ఇతర జట్ల కంటే ముంబై పటిష్టంగా ఉంది. ఆర్‌సీబీ, సీఎస్‌కే, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ అవకాశాలను కొట్టిపారేయలేం.

చాట్‌జీపీటీ: ముంబై ఇండియన్స్. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్లతో జట్టు సమతూకంగా ఉంది. రోహిత్, బుమ్రా, హార్దిక్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. బిగ్ మ్యాచ్‌ టెంపర్‌మెంట్ ఉంది. సరైన సమయంలో సత్తా చాటే చరిత్ర ఉంది. ఆర్‌సీబీ, సీఎస్‌కే నుంచి గట్టి పోటీ ఉంటుంది.

మెటా ఏఐ: ముంబై ఇండియన్స్ గెలుస్తుందనేది మా అంచనా. రోహిత్, సూర్య, హార్దిక్ వంటి స్టార్ ప్లేయర్లతో ముంబై బలంగా ఉంది. ఆర్‌సీబీ, సీఎస్‌కే, పంజాబ్ కింగ్స్ జట్లు కూడా టైటిల్ రేసులో ఉంటాయి.

ఎక్స్‌పర్ట్స్ సైతం..

స్టార్ స్పోర్ట్స్ కామెంట్రీ ప్యానెల్‌లోని 12 మంది ఎక్స్‌పర్ట్స్ కూడా ముంబై ఇండియన్స్ ఈజీగా ప్లే ఆఫ్స్ చేరుతుందని అంచనా వేసారు. 12 మందికి 12 మంది ముంబై ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుందని చెప్పారు. పేపర్‌పై ముంబై ఇండియన్స్.. ఇతర జట్ల కంటే బలంగా ఉంది. మరి విజేతగా ఏ జట్టు నిలుస్తుందో చూడాలి. మీరు ఏ జట్టు విజేతగా నిలుస్తుందని భావిస్తున్నారో కామెంట్ చేయండి.

Story first published: Friday, March 27, 2026, 16:07 [IST]
Other articles published on Mar 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+